నాతో పోలిస్తే ఆ హీరోయిన్ ల పర్ఫామెన్స్ బ్యాడ్..అనసూయ  Anasuya Bhardwaj
2021-01-07 00:02:57

టాలీవుడ్ లో ఫుల్ బిజీగా ఉన్న హాట్ బ్యూటీ అనసూయ . ఓ వైపు బుల్లితెరపై యాంకర్ గా రాణిస్తూనే మరోవైపు సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇంత బిజీగా ఉన్న అనసూయ తాజాగా టాలీవుడ్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఓ టీవీ ఇంటర్వ్యూలో అనసూయ మాట్లాడుతూ...టాలీవుడ్ లో సీక్రెట్ ఫేవరెట్ ఇజం ఉందని చెప్పింది. లాక్ డౌన్ సమయంలో తనకి నాలుగు సినిమా అవకాశాలు వచ్చాయని చెప్పింది. వాటికి ఆడిషన్స్ కూడా ఇచ్చానని పేర్కొంది. 

అయితే నాలుగు ప్రాజెక్ట్స్ లో తన పర్ఫామెన్స్ నచ్చినా కూడా అవకాశాలు వేరే వాళ్ళకి ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేసింది. దానికి కారణం సీక్రెట్ ఫేవరేట్ ఇజం ఉండటమేనని చెప్పింది. తనకంటే ఆడిషన్స్ ఇచ్చిన హీరోయిన్ ల పెర్ఫామెన్స్ బ్యాడ్ గా ఉందని వెల్లడించింది. తన పర్ఫామెన్స్ చూసి ఓ దర్శకుడు కన్నీరు పెట్టుకున్నాడని తెలిపింది. తన నటన నచ్చక పోతే ఎందుకు అంత ఎమోషన్ అవుతాడని..కానీ అవకాశం మాత్రం వేరేవాళ్లకు ఇచ్చాడంటే    ఫేవరేట్ ఇజం కాక మరేంటని అడిగింది. ఇక చేతి నిండా అవకాశాలు ఉన్న అనసూయ ఇలా స్పందించడం తో అంతా షాక్ అవుతున్నారు.

More Related Stories