అంత డిమాండ్ ఉన్న అనసూయకు ఇంతేనా



Anasuya
2021-04-29 14:31:46

జబర్ధస్త్ బ్యూటీ యాంకర్ అనసూయ ప్రస్తుతం బుల్లితెరతో పాటు వెండితెరను కూడా షేక్ చేస్తోంది. ఇప్పటికే రంగస్థలం, క్షణం, కథనం సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. అంతే కాకుండా రవితేజ హీరోగా నటిస్తున్న ఖిలాడి సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాతో పాటు పుష్ప సినిమాలోనూ అనసూయ ముఖ్య పాత్రలో నటిస్తోంది. ఇదిలా ఉండగా అనసూయ లీడ్ రోల్ గా "థాంక్యూ బ్రదర్" సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాకు రమేష్ రాపర్తి దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా..కరోనా కారణంగా విడుదలకు బ్రేక్ పడింది. ఇక ఇప్పుడు థియేటర్ లు కూడా తెరుచుకునే పరిస్థితి లేకపోవడం తో ఇప్పుడు ఈ చిత్రాన్ని ఓటీటీ లో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే మే7న ఆహాలో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఈ సినిమాను ఆహా 1.8కోట్లకు మాత్రమే కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. కానీ అనసూయకు ఉన్న క్రేజ్ తో చూస్తే సినిమాకు ఈ అమౌంట్ తక్కువే అని చెప్పాలి.

More Related Stories