జబర్దస్త్ బ్యూటీ రంగమ్మత్తకు కరోనా.!



anasuya bharadwaj
2021-01-10 13:18:47

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతుంది . సాధారణ ప్రజలతో పాటు ప్రముఖులు, సెలబ్రెటీలు సైతం కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే పలువురు సినీతారలు కరోనా బారిన పడ్డారు. అయితే దాదాపు అందరూ కరోనా ను జయించగా..ఎస్పీ బాలు లాంటి వారు కరోనా బారిన పడి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. దాంతో కరోనా ఇండస్ట్రీలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇక ఇటీవలే మెగా ఫ్యామిలి లో సైతం కరోనా కలకలం సృష్టించింది. మొదట మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు కరోనా పాజిటివ్  వచ్చింది. దాంతో ఆయన క్వారంటైన్ లోకి వెళ్లి చికిత్స తీసుకున్నారు. ఆ వెంటనే మెగా ప్రిన్క్ వరుణ్ తేజ్ కూడా తనకు కరోనా పాజిటివ్ అని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. 

ఇక ప్రస్తుతం ఈ ఇద్దరు కరోనా ను జయించారు. ఇదిలా ఉండగా తాజాగా జబర్ద్స్త్ ఫేమ్ అనసూయ తనకు కరోనా లక్షణాలు ఉన్నాయని సోషల్ మీడియాలో వెల్లడించింది. ఈరోజు ఉదయం కర్నూల్ లో ఒక ప్రోగ్రామ్ కోసం వెళుతుంటే తనకు  కరోనా లక్షణాలు ఉన్నట్టు అనిపించిందని పేర్కొంది. దాంతో ఆ ప్రోగ్రామ్ ను క్యాన్సిల్ చేసినట్టు తెలిపింది. తాను వీలైనంత త్వరగా టెస్ట్ చేసుకుంటానని చెప్పింది. ఇటీవల తనను  కలిసిన వారు అంతా  కరోనా టెస్ట్ చేసుకోవాలని సూచించింది. అంతే కాకుండా తన ఆరోగ్యం పై  ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్డేట్ ఇస్తానని పేర్కొంది. 

 

More Related Stories