రాత్రి 2 గంటల వరకూ తాగుతా.. అనసూయ 



Anchor Anasuya
2021-04-16 12:08:47

జబర్దస్త్ బ్యూటీ యాంకర్ అనసూయ పరిచయం అక్కర్లేని పేరు. యాంకర్ గా కెరీర్ ను మొదలు పెట్టిన ఈ బ్యూటీ ప్రస్తుతం సినిమాల్లోనూ ఫుల్ బిజీగా ఉంది. బుల్లి తెరపై అందాల ఆరబోతలో ఏ మాత్రం తగ్గని అనసూయ సినిమాల్లో మాత్రం తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనే నటిస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు అనసూయ చేసిన "క్షణం, రంగస్థలం, యాత్ర" సినిమాలు కూడా అలాంటివే. అయితే తనకు నచ్చితే ఐటమ్ సాంగ్స్ లో స్టెప్పులేస్తూ అనసూయ ఫిదా చేస్తుంది.

 ఇక అనసూయ ఇద్దరు పిల్లల తల్లి అయినా టాలీవుడ్ హీరోయిన్ లకు పోటీగా ఫిగర్ ను మెయిన్ టైన్ చేస్తుంది. అంతే కాకుండా ఎప్పుడూ రెడ్ బుల్ తాగిన ఎనర్జీని ప్రదర్శిస్తుంది. ఇదిలా ఉండగా సమయం దొరికినప్పుడల్లా అనసూయ సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది. తాజాగా అభిమానులతో చిట్ చాట్ చేసిన ఈ బ్యూటీ ఆసక్తికర విషయాలు వెల్లడించింది. 

ఓ నెటిజెన్ మీరు తాగుతారా అని ప్రశ్నించగా...అనసూయ ఏ మాత్రం తడుముకోకుండా అవుననే సమాధానం ఇచ్చింది. ఆ అంతే కాకుండా రాత్రి రెండు గంటల వరకూ తాగుతాను దాని వల్ల బుక్ అయ్యేది మా ఆయనే. ఇక గతంలోనూ గ్లామర్ కోసం వైన్ తాగుతానని చెప్పిన జబర్ధస్త్ భామ ఇప్పుడు 2గంటల వరకు తాగుతానని ఓపెన్ అయింది. ఇక అనసూయ ఆన్సర్ విన్న నెటిజన్ షాక్ అయ్యారు. 

More Related Stories