ఈసారైనా ప్రదీప్ పెళ్ళి అవుతుందా..Anchor Pradeep
2020-10-01 08:41:04

కరోనా లాక్ డౌన్ మొదలైన నాటి నుండి టాలీవుడ్ లో నితిన్, నిఖిల్,రానా ఇలా ఒక్కక్కరు పెళ్లి పీటలు ఎక్కేసారు. ఇక ఇప్పుడు తాజాగా ఆ లిస్ట్ లో యాంకర్ ప్రదీప్ కూడా చేరిపోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే యాంకర్ ప్రదీప్ పెళ్లి అంటూ వార్తలు రావడం ఇదేం కొత్తకాదు. ఇదివరకే ప్రదీప్ ఓ బడా రాజకీయవేత్త కూతురిని పెళ్లి చేసుకోబుతున్నాడు అనే వార్తలు వచ్చాయి. కానీ అవి నిజం కాలేదు. ఇక ఇప్పుడు మళ్లీ తాజాగా ప్రదీప్ ప్రముఖ రాజకీయ వేత్త కూతురును పెళ్లాడబోతున్నాడని అంతే కాకుండా ఇరు కుటుంబాల మధ్య మాట ముచ్చట కుడా అయిపోయిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరో రెండు మూడు నెలల్లో పెళ్లి కూడా జరిగిపోతుందనే టాక్ వినిపిస్తోంది.

అయితే ఇటీవలి కాలంలో యాంకర్ ప్రదీప్ పై తప్పుడు ఆరోపణలు వచ్చిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రదీప్ ఓ యువతిని మోసం చేస్తుందంటూ సునిషిత్ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా..ఓ యువతి కూడా తనను ప్రదీప్ బలవంతం చేశాడంటూ మీడియా ముందు వాపోయింది. అయితే తరవాత అవన్నీ కావాలనే చేసారని నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో ప్రదీప్ త్వరగా పెళ్లి చేసుకోవాలని లేదంటే ఇలాంటి పుకార్లు వస్తూనే ఉంటాయని నెటిజన్లు అనుకున్నారు. ఇక ఆ ఆరోపణల ఎఫెక్ట్ తోనే ప్రదీప్ పెళ్లికి సిద్ధమయ్యాడేమో అని కొంతమంది అనుకుంటుండగా..ఏది అయితేనేం మొత్తానికి ఇప్పటికైనా మంచి నిర్ణయం తీసుకున్నాడని కొందరు అనుకుంటున్నారు.

More Related Stories