సీనియర్ కెమెరామెన్ చాలా వేధించాడు : యాంకర్ శ్యామల



Anchor Shyamala
2021-04-21 15:51:10

తెలుగులో బుల్లితెర‌పై అల‌రిస్తున్న టాప్ యాంక‌ర్స్ లో ఒక‌రు యాంకర్ శ్యామ‌ల‌. త‌న మాట‌తీరు అందం అభిన‌యంతో శ్యామ‌ల ఎంతోమంది అభిమానుల‌ను సంపాదించుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్నో టీవీ షోల తో పాటు కొన్ని సినిమాల్లోనూ న‌టించి అల‌రించింది. అంతే కాకుండా బిగ్ బాస్ సీజ‌న్ 3లో వ‌చ్చి ప్రేక్ష‌కుల‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌యింది. అయితే గ్లామ‌ర్ ఫీల్డ్ లో ఎంతో మందికి ఎదురైన చేదు అనుభ‌వాలు శ్యామ‌ల‌కు కూడా ఎదుర‌య్యాయ‌ట‌. ఈ విష‌యాన్ని శ్యామ‌ల ఓ యూట్యూబ్ ఛాన‌ల్ కు ఇచ్చిన ఇంట‌ర్యూలో వెల్ల‌డించింది. సినిమా ప‌రిశ్ర‌మ‌కు వ‌చ్చిన కొత్త‌ల్లో త‌న‌కు పెద్ద‌గా ప‌రిచ‌యాలు లేవ‌ని తెలిపింది. దాంతో ఎంతో అకాశాల కోసం ఎన్నో క‌ష్టాలు ప‌డ్డాన‌ని తెలిపింది.

అంతే కాకుండా త‌న స్వ‌గ్రామం హైద‌రాబాద్ కాద‌ని కేవ‌లం సినిమా అవ‌కాశాల కోసమే హైద‌రాబాద్ కు వ‌చ్చాన‌ని తెలిపింది. మొద‌ట్లో కొన్ని సీరియ‌ల్స్ లో కూడా న‌టించాన‌ని తెలిపింది. అయితే సీరియ‌ల్స్ లో న‌టిస్తున్న స‌మ‌యంలో ఓ పేరున్న కెమెరామెన్ త‌న‌ను వేధింపుల‌కు గురిచేశాడ‌ని పేర్కొంది. త‌నతో ఆ సీనియ‌ర్ కెమెరామెన్ అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడ‌ని తాను చెప్పిన‌ట్టు విన‌క‌పోతే అవ‌కాలు రాకుండా చేస్తాన‌ని బెదిరింపుకు పాల్ప‌డ్డాడ‌ని తెలిపింది. ఈ విష‌యాన్ని ఆ సీరియ‌ల్ ద‌ర్శ‌క నిర్మాత‌లకు చెప్ప‌డంతో అత‌డినుండి వేధింపులు త‌క్కువ‌య్యాయ‌ని చెప్పుకొచ్చింది. ఇక మొత్తానికి ఎన్నో క‌ష్టాల‌ను ఓర్చుకున్న శ్యామ‌ల ఇప్పుడు మంచి స్థానంలో ఉంది. 

More Related Stories