కొడుకుతో యాంకర్ సుమ సినిమా Anchor Suma
2020-10-30 16:49:48

తెలుగులో ఎవర్ గ్రీన్ యాంకర్ ఎవరు .? అని అడిగితే ఎవరైనా చెప్పేది యాంకర్ సుమ కనకాల పేరనే చెప్పవచ్చు. సుమ పుట్టింది పెరిగింది తమిళనాడులోనే అయినప్పటికీ రాజీవ్ కనకాల ను వివాహం చేసుకుని స్పష్టంగా తెలుగు నేర్చుకుంది. ఇక సుమ వాళ్ళ మామ, భర్త రాజీవ్ సినీ పరిశ్రమకు చెందిన వాళ్లే కావడంతో సుమ కూడా బుల్లితెర పై అడుగుపెట్టింది. అంతే కాకుండా సుపర్ ఫాస్ట్ గా సక్సెస్ అయ్యింది కూడా. సుమ స్టార్ మహిళ, క్యాష్ లాంటి ప్రోగ్రామ్ లకు వెయ్యి ఎపిసోడ్ లకు పైగా యాంకరింగ్ చేసి ఒక రికార్డును కూడా సొంతం చేసుకుంది. మరోవైపు పెద్ద సినిమాల నుండి చిన్న సినిమాల వరకు ఆడియో ఫంక్షన్లు అయినా సక్సెస్ మీట్ లు అయినా యాంకర్ గా సుమ కనకాల నే కనిపిస్తుంది. దాంతో సుమ బాగానే వెనకేసింది అని కూడా టాక్. అయితే తాజాగా ఓ వార్త చక్కర్లు కొడుతోంది. రాజీవ్ సుమ ల కుమారుడిని హీరోగా ఎంట్రీ ఇప్పించేందుకు సుమ గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. తానే నిర్మాతగా మారి సుమ కొడుకుతో సినిమా తియ్యడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం. ఇక యాంకర్ గా సక్సెస్ అయిన సుమ నిర్మాతగా చేతులు కాల్చుకుంటుందా.?లేదంటే కొడుకుకు మంచి సక్సెస్ ఇచ్చి తాను కూడా నిర్మాతగా పేరు తెచ్చుకుంటుందా అన్నది చూడాలి.

More Related Stories