ఇండియన్ 2 లో కీలకమార్పులు నిజమేనా  Anil Kapoor
2019-10-02 13:17:49

శంకర్ దర్శకత్వంలో రెండు దశాబ్దాల క్రితం వచ్చిన 'భారతీయుడు' సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది. దాంతో కొంతకాలం క్రితం ఆ సినిమాకి సీక్వెల్ చేసేందుకు శంకర్ రంగంలోకి దిగాడు. లైకా ప్రొడక్షన్స్ వారి నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతోంది. అట్టహాసంగా మొదలయిన ఈ సినిమా షూటింగ్ ఆగుతూ ఆగుతూ జరుగుతోంది. ఈ సినిమాకి సంబంధించిన కొన్ని సన్నివేశాలను రాజమండ్రి సెంట్రల్ జైల్లో చిత్రీకరించారు. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా అనిల్ కపూర్ పేరు తెరపైకి వచ్చింది. నిజానికి ఈ సినిమాలో ముందుగా విలన్ గా అజయ్ దేవగణ్ ను అనుకున్నారు. 

అయితే ఈ సినిమా షెడ్యూల్స్ లో మార్పులు జరగడంతో ఆయన చేస్తున్న బాలీవుడ్ డేట్స్ కుదరక తప్పుకున్నాడని అంటున్నారు. దాంతో దర్శక నిర్మాతలు అనిల్ కపూర్ ను సంప్రదించడం ఖాళీగా ఉన్న ఆయన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం జరిగిపోయిందని సమాచారం. శంకర్ , అనిల్ కపూర్ ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి. అనిల్ కపూర్ కు దర్శకుడు శంకర్ సీన్ వివరిస్తున్న ఫోటో అని అంటున్నారు. ఆ పిక్ బయటకు రావడంతో ఈ విషయం లీక్ అయ్యింది. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, సిద్దార్థ్, ప్రియా భవాని శంకర్, ఐశ్వర్య రాజేశ్, విద్యుత్ జమ్వాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాని తెలుగులో భారతీయుడు 2 పేరుతో విడుదల చేయనున్నారు. 

More Related Stories