తన మార్క్ కోసం పరితపిస్తున్న అనిల్ రావిపూడి anil ravipudi
2019-10-23 10:25:24

అన్ని బాషల సంగతి ఎలా ఉన్నా మన తెలుగులో ఒక్కో దర్శకుడికీ ఒక్కో మార్క్ ఉంటుంది. ఆ మార్క్ ఏర్పడే వరకూ ఏమో కానీ అది ఏర్పడిందంటే దానిని నిలబెట్టుకోడానికి చేయని ప్రయత్నాలు ఉండవు. అంటే రాఘవేంద్ర రావు సినిమాల్లో హీరోయిన్ల బొడ్డుపై పూలు, పళ్ళు విసరడం, ఆర్ నారాయణ మూర్తి సినిమాలో విప్లవ పాటలు, కొరటాల శివ సినిమాల్లో ఒక మెసేజ్, పూరి సినిమాల్లో హీరో బేవార్స్ గా తిరగడం లాంటివి ఈ కోవలోకే వస్తాయి. అయితే అది స్టైల్ అనాలో ఇంకేమనాలో తెలీదు కానీ హ్యాట్రిక్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సినిమాల్లో కూడా ఒక కామన్ పాయింట్ ఉంది. అదే ఊతపదం.

అనిల్ రావిపూడి దర్శకుడిగా చేసిన నాలుగు సినిమాలు పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2 వీటిల్లో కామెడీ బాగుంటుంది. ఆ కామెడీ హైలైట్ కావడానికి ఆయన ఎంచుకున్న అంశం ఊతపదం. పటాస్ సినిమాలో పార్థాయ ప్రతి బోధితాం అంటూ వచ్చే భగవద్గీత కానీ, సుప్రీమ్ సినిమాలో జింగ్ జింగ్ అమేజింగ్ కానీ, రాజా ది గ్రేట్ చిత్రంలో ఇట్స్ లాఫింగ్ టైమ్ కానీ, ఎఫ్ 2 లో అంతేగా అంతేగా లాంటి పదాలు ప్రేక్షకులకి గుర్తుండి పోతాయి. ఇప్పుడు ఆయన మహేష్ తో సరిలేరు నీకెవ్వరూ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో కూడా తన మేకింగ్ తగ్గకుండా కామెడీ  ట్రాక్స్ ఉంటాయట. తనకు కలిసొచ్చిన ఊతపదాన్ని ఇందులో కూడా ఒకటి సృష్టించాడని అంటున్నారు. ఆ పదం ఏమిటనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంచారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాని అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  

More Related Stories