వారేవా.. అఖిల్ తర్వాత సినిమా ఆ దర్శకుడితో ఉండబోతుందా..Anil Ravipudi
2020-08-09 00:05:27

కొండంత అక్కినేని బ్యాక్ గ్రౌండ్ వుండి కూడా ఇప్పటివరకు ఒక్క హిట్ కూడా కొట్టలేకపోయాడు అఖిల్. పాపం ఆయన నటించిన మూడు సినిమాలు కూడా డిజాస్టర్ అయ్యాయి. అందులో హలో సినిమా పాజిటివ్ టాక్ వచ్చినా కూడా అది నిలబడలేకపోయింది. ఈ క్రమంలో తొలి విజయం కోసం చకోర పక్షిలా చూస్తున్నాడు అఖిల్. ఆయనకు హిట్ ఇచ్చే దర్శకుడు ఎవరు అని నాగార్జున కూడా ఆసక్తిగా గమనిస్తూ ఉన్నాడు. ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో నటిస్తున్నాడు అక్కినేని వారసుడు. బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాకు దర్శకుడు. త్వరలో సినిమా విడుదల కానుంది. ఇదిలా ఉంటే ఈయన తర్వాత సినిమాపై ఇప్పుడు ఇండస్ట్రీలో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. అపజయం ఎరుగని దర్శకుడు అనిల్ రావిపూడి.. అఖిల్ కోసం ఒక కథ సిద్ధం చేసినట్లు ప్రచారం జరుగుతుంది. 

ఇప్పటివరకు విజయం లేని అఖిల్ అపజయం లేని అనిల్ రావిపూడితో జోడి కడితే కాంబినేషన్ అదిరిపోతుందని అభిమానులు కూడా వేచి చూస్తున్నారు. ఖచ్చితంగా ఈ కాంబినేషన్ లో అఖిల్ బ్లాక్ బస్టర్ కొడతాడని ఫాన్స్ ధీమాగా చెబుతున్నారు. మరోవైపు నాగార్జున కూడా అనిల్ రావిపూడితో సినిమా చేయడానికి తనవంతు వంతు ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కాంబినేషన్ పై త్వరలోనే పూర్తి వివరాలు బయటకు రానున్నాయి. ఒకవేళ అన్నీ కుదిరి అనిల్ సినిమా సెట్ అయితే అఖిల్ కెరీర్ కు అంతకంటే కావాల్సిందేముంది అంటున్నారు అభిమానులు. అనిల్ ప్రస్తుతం ఎఫ్ 3 సినిమాతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత బాలయ్యతో సినిమా చేస్తాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఇన్ని సినిమాల మధ్య అఖిల్ సినిమా ఉంటుందా లేదా అనేది కాలమే నిర్ణయించాలి.

More Related Stories