సౌత్ ఇండస్ట్రీ నెం 1 మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్ర..Anirudh Ravichander
2019-10-17 13:51:07

ఇప్పుడు సౌత్ ఇండ‌స్ట్రీలో ఇదే పోరు జ‌రుగుతుంది. చాలామంది ద‌ర్శ‌కుల‌కు అనిరుధ్, దేవీల మ‌ధ్య యుద్ధం జ‌రుగుతుంది. ఎవ‌ర్ని త‌మ సినిమా కోసం తీసుకోవాలో తెలియ‌క తిక‌మ‌క‌ప‌డుతున్నారు. వీళ్లిద్ద‌రి మ‌ధ్య త‌మ‌న్ లాంటి వాళ్లు సైలెంట్ గా త‌మ ప‌ని తాము చేసుకుంటున్నారు. కానీ పోటీ మాత్రం ప్ర‌ధానంగా ఈ ఇద్ద‌రి మ‌ధ్యే ఉంది. త్రివిక్ర‌మ్ లాంటి ద‌ర్శ‌కుల‌కు ఒక‌ప్పుడు దేవీ ఆస్థాన సంగీత ద‌ర్శ‌కుడు. కానీ ఆ త‌ర్వాత అజ్ఞాత‌వాసి కోసం అనిరుధ్  వ‌చ్చాడు. ఆ వెంట‌నే థ‌మ‌న్ ను తీసుకున్నాడు. ఇక ఇప్పుడు తెలుగులో అనిరుధ్ ను పూర్తిగా వాషౌట్ చేస్తున్నాడు దేవీ శ్రీ ప్రసాద్. కానీ నాని జెర్సీ, గ్యాంగ్ లీడర్ సినిమాలతో మళ్లీ తన సత్తా చూపించాడు ఈ కుర్ర సంగీత దర్శకుడు. అజ్ఞాత‌వాసి ఫ్లాప్ అయ్యుండొచ్చు కానీ ఆ సినిమాలో పాట‌లు మాత్రం బాగానే హిట్ అయ్యాయి. ముఖ్యంగా గాలివాలుగా అయితే పెద్ద హిట్. దాంతో అనిరుధ్ కోసం ఇంకా మ‌న ద‌ర్శ‌కుల చూపులు వెళ్తున్నాయి. జెర్సీ, గ్యాంగ్ లీడర్ మ్యూజిక్ కూడా హిట్ కావడం అనిరుధ్ కు కలిసొచ్చే అంశం. ఇక దేవీ కూడా త‌క్కువేం తిన‌లేదు. తెలుగులో దేవీ కుమ్మేస్తుంటే త‌మిళ‌నాట అనిరుధ్ అల్లాడిస్తున్నాడు. అనిరుధ్ మ్యూజిక్ లో గిటార్ త‌ప్ప మ‌రేదీ వినిపించ‌లేద‌నే విమ‌ర్శ‌లున్నాయి. పైగా అన్ని పాట‌లు తనే పాడ‌టం ప్రేక్ష‌కుల‌కు పెద్ద‌గా రుచించ‌లేదు. ఇలాంటి ప‌రిస్థితుల్లో తెలుగు ప్రేక్ష‌కుల‌కు అనిరుధ్ న‌చ్చ‌డం అంత తేలికైన విష‌యం కాదు. మ‌రోవైపు దేవీ శ్రీ ప్ర‌సాద్ కాపీ ట్యూన్స్ ఇచ్చినా కూడా క‌చ్చితంగా అల‌రించే పాట‌లు ఇస్తాడ‌నే న‌మ్మ‌కం ఉంది. దాంతో తెలుగును దేవీ.. త‌మిళ్ ను అనిరుధ్ క‌లిసి పంచుకుంటున్నారు. అన్నట్లు అక్టోబర్ 18న అనిరుధ్ రవిచంద్ర బర్త్ డే. ఈయన పుట్టినరోజును స్టార్ హీరోలు కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. 

More Related Stories