కొట్టుకున్న అంజలి లక్ష్మి రాయ్ Anjali Lakshmi Rai
2020-02-18 01:18:26

అంజలి, లక్ష్మీరాయ్‌ ప్రధాన పాత్రల్లో ఆదిత్‌ అరుణ్‌ స్పెషల్ రోల్ లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆనంద భైరవి’. కర్రీ బాలాజీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని హరివేన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై ఇటికేల రమేష్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఆనందిని పాత్ర కోసం అంజలి చాలా స్లిమ్‌ అయ్యారు.  ఆ పాత్ర కోసం స్కూటీ రైడ్‌ చేస్తున్న సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నప్పుడు స్కూటీ మీద నుంచి పడటంతో ఆమెకు గాయాలు కూడా అయ్యాయి.

ఇక తాజాగా ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు కొట్టుకుంతున్నారట. అయితే బైట ఎక్కడా వీరు కొట్టుకోక పోయినా రామానాయుడు స్టూడియోలో 'ఆనంద భైరవి' కోసం ఈ ఇద్దరూ ఫైట్ సీన్ లో పాల్గొంతున్నారట.  అంజలి, లక్ష్మీ రాయ్, ఆదిత్ అరుణ్, సుమన్, బ్రహ్మాజీ, మురళి శర్మ, జయప్రకాశ్, కళ్యాణి, ఆశిష్ విద్యార్థి, పృథ్వీ, గుండు సుదర్శన్, జయవాణి, గిరి, మణిచందన, ప్రభాస్ శ్రీను, సుబ్బరాయ శర్మ, ధన్ రాజ్, ఐశ్వర్య, విద్యుల్లేఖరామన్, బాహుబలి ప్రభాకర్, ఛత్రపతి శేఖర్, పర్వీన్ రాజ్, దినేష్, రాహుల్, సాత్విక్, కె .శ్రీ హర్ష తదితరులు నటిస్తున్న ఈ సినిమా మీద మంచి అంచనాలే ఉన్నాయి.

More Related Stories