గుజరాత్ లో బుమ్రా అనుపమ పెళ్లి...క్లారిటీ ఇచ్చిన అనుపమ తల్లి Anupama Parameshwaran
2021-03-06 16:32:08

భారత పేస్ బౌలర్ బుమ్రా పెళ్లి కారణంగా నాలుగో టెస్ట్ తో పాటు ఇంగ్లాడ్ తో ఆడాల్సిన వన్డేలు, టీ 20లకు దూరమైన సంగతి తెలిసిందే. కాగా ప్రముఖ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తో బుమ్రా ప్రేమలో ఉన్నట్టు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి..అంతే కాకుండా త్వరలోనే ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ కూడా రకరకాల వార్తలు వచ్చాయి. అంతే కాకుండా అనుపమ పరమేశ్వరన్ ఇటీవల గుజారాత్ కు వెళ్లగా అనుపమ బుమ్రా పెళ్లి గుజరాత్ లో జరగబోతుంది అంటూ కూడా పుకార్లు వచ్చాయి. అయితే తాజాగా ఆ వార్తలపై అనుపమ పరమేశ్వరన్ తల్లి స్పందించింది. అనుపమ తో బుమ్రా పెళ్లి అంటూ వస్తున్న వార్తలను ఆమె కొట్టి పారేసింది.ఓ మలయాళం పోర్టల్ తో అనుపమ తల్లి మాట్లాడింది.  ఇదంతా చెత్త..అనుపమ ఒక తెలుగు సినిమా షూట్ కోసమే గుజరాత్ కు వెళ్ళింది తప్ప మరే కారణం లేదంటూ వ్యాఖ్యానించింది. ఇదిలా ఉండగా బుమ్రా ఓ స్పోర్ట్స్ అనలిస్ట్ ను పెళ్లి చేసుకోబోతున్నారు. అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఆ వార్తలపై ఎప్పుడు క్లారిటీ వస్తుందో చూడాలి.

More Related Stories