వీళ్ల‌కు కానీ హిట్ ప‌డ‌క‌పోతేనా..!Anupama-Parameswaran
2018-08-04 14:35:45

ఇండ‌స్ట్రీకి ఎలా వ‌చ్చారు అనేది కాదు.. ఇప్పుడు ఎలా ఉన్నారు అనేది అంద‌రికీ కావాలి. అప్ప‌ట్లో మాకు విజ‌యాలు ఉన్నాయి అని చెప్పుకుంటే స‌రిపోదు. ఇక్క‌డ ఇప్పుడు విజ‌యాలకే ఇంపార్టెన్స్ ఇస్తారు. అచ్చంగా ఇదే స‌మ‌స్య‌తో కొంద‌రు హీరోయిన్లు తెగ బాధ ప‌డిపోతున్నారు. వాళ్ళంతా వ‌ర‌స విజ‌యాల‌తో ఇండ‌స్ట్రీకి వ‌చ్చారు. కానీ స‌డ‌న్ గా అనుకోని ఫ్లాపుల‌తో వెన‌క‌బ‌డ్డారు. ఒక‌టి రెండు ఇలా వ‌ర‌స‌గా ఫ్లాపులు వ‌చ్చేస‌రికి కెరీర్ ఎటు పోతుందో తెలియ‌ని క‌న్ఫ్యూజ‌న్ లో ప‌డిపోయారు. 

అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ఇందులో ముందుంది. మొన్న‌టి వ‌ర‌కు ఫుల్ ఫామ్ లో ఉంది ఈ భామ‌. అ..ఆ, ప్రేమ‌మ్, శ‌త‌మానం భ‌వ‌తి లాంటి వ‌ర‌స విజ‌యాల‌తో ఉన్న అనుప‌మ కెరీర్ కు ఉన్న‌ది ఒక‌టే జింద‌గీతో బ్రేకులు ప‌డ్డాయి. త‌ర్వాత కృష్ణార్జున యుద్ధం.. మొన్న తేజ్ ఐ ల‌వ్ యూతో ఫ్లాప్స్ హ్యాట్రిక్ పూర్తైంది. ఇప్పుడు హ‌లో గురు ప్రేమ‌కోస‌మే సినిమాపైనే అనుప‌మ ఆశ‌ల‌న్నీ ఉన్నాయి. రామ్ హీరోగా న‌టిస్తోన్న ఈ చిత్రానికి త్రినాథ‌రావ్ న‌క్కిన ద‌ర్శ‌కుడు. 

అను ఎమ్మాన్యువ‌ల్ ప‌రిస్థితి కూడా అంతే. మ‌జ్నుతో ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన ఈ బ్యూటీ.. ఆ త‌ర్వాత గోపీచంద్ ఆక్సీజ‌న్, ప‌వ‌న్ క‌ళ్యాణ్ అజ్ఞాత‌వాసిల‌తో డిజాస్ట‌ర్ల‌ను అందుకుంది. ఓ ర‌కంగా ఐరెన్ లెగ్ అనే ముద్ర వేయించుకుంది అను. మొన్నొచ్చిన నా పేరు సూర్య కూడా డిజాస్ట‌ర్ కావ‌డంతో అర్జంట్ గా ఈ భామ‌కు ఇప్పుడు హిట్ కావాలి. అది నాగ‌చైత‌న్య శైల‌జారెడ్డి అల్లుడుతో వ‌స్తుంద‌ని న‌మ్ముతుంది అను. ఇక సాయిప‌ల్ల‌వి కూడా క‌ణంతో తొలి ఫ్లాప్ అందుకుంది. ప్ర‌స్తుతం తెలుగులో హ‌ను రాఘ‌వ‌పూడి ప‌డిప‌డి లేచే మ‌న‌సులో న‌టిస్తుంది ప‌ల్ల‌వి. ఇలా వీళ్లంద‌రికీ ఇప్పుడు అర్జంట్ గా ఓ హిట్ ప‌డాల్సిందే. లేదంటే లేనిపోని క‌ష్టాలు వ‌చ్చేస్తాయి. 

More Related Stories