అనుష్క శెట్టి @ 15 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ..anu15
2019-07-22 03:53:27

అవును.. అప్పుడే అనుష్క ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 14 ఏళ్లు పూర్తైపోయింది. ఇప్పుడు 15వ ఏట అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ‌. ఇదే విష‌యాన్ని అనుష్క సినిమా యూనిట్ కూడా క‌న్ఫ‌ర్మ్ చేసింది. ప్ర‌స్తుతం ఈమె న‌టిస్తున్న నిశ్శ‌బ్ధం సినిమా ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది. మాధ‌వ‌న్ హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని మ‌ధుక‌ర్ తెర‌కెక్కిస్తున్నాడు. కోన వెంక‌ట్ నిర్మాత‌. ఈ సినిమా షూటింగ్ అంతా అమెరికాలోనే జ‌రుపుకుంటుంది. ఈ చిత్రంలో మూగ చెవిటి అమ్మాయిగా విభిన్న‌మైన పాత్ర‌లో న‌టిస్తుంది జేజ‌మ్మ‌. ఇక ఇప్పుడు ఈమె ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 15 ఏళ్లు అవుతున్న సంద‌ర్భంగా ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. సూప‌ర్ సినిమాతో ఇండ‌స్ట్రీకి వ‌చ్చింది ఈ ముద్దుగుమ్మ‌. అప్ప‌ట్లో బెంగళూర్లో యోగా టీచ‌ర్ గా ఉన్న అనుష్కను సూప‌ర్ సినిమాతో ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేసాడు పూరీ జ‌గ‌న్నాథ్. ఆ త‌ర్వాత రెండు మూడేళ్లు ఇబ్బంది ప‌డ్డా విక్ర‌మార్కుడు లాంటి సినిమాల‌తో నిల‌బ‌డింది. అరుంధ‌తి సినిమాతో తిరుగులేని ఇమేజ్ సంపాదించుకుంది అనుష్క‌. ఇప్ప‌టికీ వ‌ర‌స సినిమాలు చేస్తూ లేడీ ఓరియెంటెడ్ స‌బ్జెక్టుల‌కు పెద్దదిక్కుగా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ‌. ఈ మ‌ధ్య కాలంలో హీరోల‌తో న‌టించ‌డం మానేసి.. పూర్తిగా లేడీ ఓరియెంటెడ్ స్క్రిప్టుల‌కు ఓకే చెప్పేసింది అనుష్క‌. భాగ‌మ‌తి కూడా ఇలా వ‌చ్చి సూప‌ర్ హిట్ అయింది. మొత్తానికి 15 ఏళ్లు ఇండ‌స్ట్రీలో.. ఈ పోటీలో పూర్తి చేసుకోవ‌డం అంటే చిన్న విష‌యం కాదు. కానీ అనుష్క పూర్తి చేసి ఔరా అనిపించింది.

More Related Stories