అనుష్కతో కన్నీరు పెట్టించిన సుమsuma
2020-03-20 08:19:29

కొంత మంది ఏమి చేసినా ఏమి చూసినా అంతా సంచలనమే. అలాంటి వారిలో సెలబ్రిటీలు ముందుంటారు. ఇప్పుడు అనుష్క గురించి కూడా ఆలాంటి చర్చే జరుగుతోంది. తాజాగా ఆమె ఈ టీవీలో ప్రసారమయ్యే క్యాష్‌ ప్రోగ్రాంలో పాల్గొంది. ఇందుకు సంబంధించిన ప్రోమోను 'మల్లెమాల' ఛానెల్ యూట్యూబ్ లో విడుదల చేసింది. ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న అనుష్క ప్రభాస్‌ గురించి ఏదైనా చెప్పమంటే నా కొడుకు గురించా అని అడగడం దానికి క్లారిటీ ఇవ్వడం కనిపించింది. ఇక అనుష్క కన్నీరు పెట్టుకోవడం దానికి బాహుబలి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఉండడంతో ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది.

ఇక ఈ రెండిటిలో ఏదైనా వదులుకోవాల్సి వస్తే ప్రభాస్‌తో ఫ్రెండ్‌షిప్ వదులుకుంటారా?, సినిమాలలో యాక్టింగ్ వదులుకుంటారా? అని సుమ అడిగిన ప్రశ్నకు ఫ్రెండ్‌షిప్ కన్న సినిమాలు ముఖ్యం కాదని అలాంటి సిచువేషన్ ఎదురైతే పక్కాగా సినిమాలే వదిలేస్తానని తేల్చి చెప్పింది. అయితే అంతసేపు సరదాగా, ఫన్నీగా కనిపింపించిన స్వీటీ అనుష్క ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యి కన్నీరు ఎందుకు పెట్టుకుంది ? అనేది తెలియాలంటే మాత్రం మార్చ్ 21న రాత్రి 9:30 గంటలకు వచ్చే క్యాష్ ప్రోగ్రామ్ చూడాల్సిందే.

More Related Stories