అనుష్కకు ఆ ఒక్క విషయంలో టెన్షన్ తప్పడం లేదు..anushka
2019-11-17 14:46:44

ఒక్కోసారి కెరీర్ లో తీసుకునే నిర్ణ‌యాలు చాలా దారుణంగా ఉంటాయి. అవి పూర్తిగా కెరీర్ నే మార్చేసినా ఆశ్చ‌ర్య‌ప‌డాల్సిన ప‌నిలేదు. ఇప్పుడు అనుష్క‌ను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. క్రేజ్ చూస్తే ఆకాశ‌మంత ఉంది.. కానీ అవ‌కాశాలు మాత్రం అప్పుడొక‌టి ఇప్పుడొక‌టి వ‌స్తున్నాయి. ఒక్క మాట‌లో చెప్పాలంటే ఇప్పుడు అనుష్క స్టార్ హీరోయిన్ కాదేమో అనిపిస్తుంది. అనుష్క కెరీర్ మొద‌లుపెట్టి 15 ఏళ్లు దాటేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఎప్పుడు కూడా ఇంత బ్రేక్ తీసుకుని ఎర‌గ‌దు. అలాంటిది ఏడాదిగా ఒక్క సినిమా కూడా చేయ‌కుండా ఉంది అనుష్క‌. ఈ మ‌ధ్యే మ‌ళ్లీ నిశ్శబ్ధం సినిమాతో బిజీ అయింది అనుష్క‌. కోన వెంక‌ట్ క‌థ అందించి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని హేమంత్ మ‌ధుక‌ర్ తెర‌కెక్కిస్తున్నాడు. మంచు విష్ణు హీరోగా వచ్చిన వస్తాడు నా రాజు సినిమాను తెరకెక్కించాడు ఈయన. మనోడు చెప్పిన కథ నచ్చి నిశ్శబ్ధం సినిమా చేస్తుంది అనుష్క. అమెరికా బేస్డ్ థ్రిల్ల‌ర్ క‌థ ఇది. ఇందులో మాధ‌వ‌న్ సెల్లో ప్లేయ‌ర్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు. అంటే పియానో వాయించే పాత్ర అన్న‌మాట‌. ఇక అనుష్క ఆర్ట్ ల‌వ‌ర్ పాత్ర‌లో క‌నిపిస్తుంది. ఆమె మాట్లాడలేదు కానీ ఆమె ఆర్ట్ మాట్లాడుతుందనేది చిత్ర కథ. ఈ చిత్ర షూటింగ్ వేగంగా జ‌రుగుతుంది. త్వరలోనే సినిమా విడుద‌ల కానుంది. ఈ సినిమా నాలుగు భాషల్లో విడుదల కానుంది.

తెలుగుతో పాటు తమిళ, మళయాల, హిందీలో కూడా నిశ్శబ్ధం విడుదలవుతుంది. అనుష్క సినిమాకు అంత సీన్ ఉందా అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. సౌత్ అంటే ఓకే కానీ అనుష్కకు హిందీలో మార్కెట్ ఏం ఉందని నిశ్శబ్ధం సినిమాను అక్కడ విడుదల చేస్తున్నారంటూ సెటైర్లు పేలుతున్నాయి. అయితే కోన వెంకట్ మాత్రం ఇది పాన్ ఇండియా కథ అంటున్నాడు. అనుష్కకు ఇప్పుడు ఈ టెన్షన్ ఎక్కువైపోతుంది. ఈ సినిమా కోసం బాగానే బ‌రువు త‌గ్గిపోయింది అనుష్క‌. ఈ మధ్యే విడుదలైన టీజర్ బాగానే ఉంది. ఒక్క ముక్క కూడా లేకుండా టీజర్ కట్ చేసాడు దర్శకుడు హేమంత్. ఇందులో హాలీవుడ్ స్టార్ మైఖెల్ మ్యాడ్స‌న్ కూడా న‌టిస్తున్నాడు. షాలిని పాండే, సుబ్బ‌రాజు, అంజ‌లి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. మొత్తానికి చూడాలిక.. నిశ్శబ్ధంతో అనుష్క నిజంగానే అంత మాయ చేస్తుందో లేదో..?

More Related Stories