ఆ దర్శకుడి కొడుకుతో అనుష్క పెళ్లి నిజమేనా...Anushka Shetty
2020-02-27 17:09:22

తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉండే ప్రశ్న అనుష్క పెళ్లెప్పుడు.. నిజంగానే ఇది ఒక గండికోట రహస్యం. ఎందుకంటే ఎప్పుడు అడిగినా ఇప్పుడు అప్పుడు అంటుంది కానీ ఆ అప్పుడు ఎప్పుడో చెప్పడం లేదు అనుష్క. వయసు 40కి వస్తున్నా కూడా ఇంకా పెళ్లి మీద ధ్యాస లేదు అంటుంది ఈ జేజమ్మ. ప్రస్తుతానికి సినిమాలతో బిజీగా ఉంది అనుష్క. రెండేళ్లుగా సినిమాల‌కు దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ.. మళ్లీ 

ఇప్పుడు కోన వెంకట్ సినిమాతో వస్తుంది. ఈ చిత్ర షూటింగ్ ఎక్కువ భాగం అమెరికాలోనే జరిగింది. త్వరలోనే సినిమా విడుదల కానుంది. నిశ్శబ్ధం సినిమాపై అంచనాలు కూడా పర్లేదు. ఇదిలా ఉంటే పెళ్లి ముచ్చట మరోసారి అనుష్క ముందు వాలింది. దీనికి ఎప్పట్లాగే మరోసారి ఇప్పుడు కాదు అంటూ తప్పించుకుంది ఈ భామ‌. పెళ్లెప్పుడు అంటే తగిన వరుడు దొరికినప్పుడు అంటూ సమాధానం చెబుతుంది అనుష్క. మరి ఆ తగిన వరుడు ఎప్పుడు దొరుకుతాడు అంటే సమాధానం చెప్పడం లేదు. ప్రభాస్ తో అనుష్క‌కు ప్రేమాయణం నడుస్తుందని కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. 

అయితే దీనిపై ప్రభాస్ మాత్రం అలాంటిదేమీ లేదని ఖండించాడు. అనుష్క తన స్నేహితురాలు మాత్రమే.. తమ బంధాన్ని త‌ప్పుగా అర్థం చేసుకోవ‌ద్దంటూ అభిమానుల‌ను కోరుతున్నాడు. ఇక అనుష్క కూడా ప్రభాస్ తో పెళ్లి అంటే నవ్వుకుంటుంది. తను మంచి స్నేహితుడు అంటూ కొట్టిపారేస్తుంది. ఇదే సమయంలో ఆ మధ్య ఓ క్రికెటర్ ను పెళ్లి చేసుకుంటుందనే ప్రచారం కూడా జరిగింది. దీన్ని కూడా ఖండించింది ఈమె. ఇదిలా ఉంటే ఇప్పుడు ఓ సీనియర్ దర్శకుడి కుమారుడితో అనుష్క పెళ్లి జరగబోతుందని తెలుస్తుంది. ఇప్పటికే ఆయన ఓ బాలీవుడ్ రైటర్ ను పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చాడు. ఇప్పుడు ఆయన్ని రెండో పెళ్లి చేసుకోబోతుందనే ప్రచారం జరుగుతుంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలిక.

More Related Stories