అనుష్కకు ఇద్దరూ ఒకేసారి ముద్దు పెట్టారు.. ఫోటో వైరల్.. Anushka Shetty
2019-12-03 17:03:00

అనుష్క .. తెలుగు ఇండస్ట్రీలో ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హీరో అవసరం లేకుండా కేవలం లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో బాక్సాఫీస్ బద్దలు కొట్టగల ఇమేజ్ ఈ ముద్దుగుమ్మ సొంతం. ఈ మధ్య కాలంలో సినిమాలు కాస్త తగ్గించింది అనుష్క శెట్టి. ప్రస్తుతం నిశ్శబ్దం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ ముద్దుగుమ్మ.  

ఇదిలా ఉంటే తాజాగా అనుష్కకు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అందులో  తన సోదరులు ఇద్దరు  అనుష్కకు ఒకేసారి  బుగ్గలపై ముద్దులు పెడుతూ  తన ప్రేమని చూపించారు.  నవంబర్ 7న అనుష్క జన్మదిన వేడుకలు తన కుటుంబంతో సరదాగా జరుగుతుంది అనుష్క శెట్టి.  దానికి సంబంధించిన ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఫోటోలో అనుష్క సోదరులు గుణరంజన్ శెట్టి.. సాయి రమేష్ శెట్టి ఇద్దరూ తమ ప్రియమైన సోదరికి ఒకేసారి ప్రేమగా బుగ్గపై ముద్దిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 

ఇక సినిమాల విషయానికి వస్తే అనుష్క గతంలో మాదిరి ఇప్పుడు జోరు చూపించడంలో కాస్త వెనకబడిపోయింది.  అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి, భాగమతి ఇలా లేడి ఓరియంటెడ్ సినిమాలతో పాటు అన్ని రకాల పాత్రలు చేసిన అనుష్క.. ఈ మధ్య  వయసు పెరగడంతో సినిమాలు తగ్గించేసింది. ప్రస్తుతం హేమంత్ మధుకర్ తెరకెక్కిస్తున్న నిశ్శబ్దం సినిమాతో జనవరి 31న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ యోగా బ్యూటీ. ఈ సినిమా విజయం సాధిస్తేనే భవిష్యత్తులో అనుష్కకు మరిన్ని అవకాశాలు వస్తాయి. లేదంటే పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లు అనుష్క అలాగే ఖాళీగా ఉండిపోవాల్సిన పరిస్థితులు వస్తాయేమో.
 

More Related Stories