కత్తి మహేష్ కు ఏపీ ప్రభుత్వం 17లక్షల ఆర్థికసాయంkathi mahesh
2021-07-02 16:23:37

సినీ విశ్లేషకుడు కత్తి మహేశ్‌ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న  కత్తి మహేష్‌ ట్రీట్మెంట్ ఖర్చుల కోసం జగన్ సర్కార్ 17 లక్షల భారీ ఆర్థిక సాయం విడుదల వేసింది. ఈ మేరకు అధికారికంగా సిఎం క్యాంప్ ఆఫీస్ నుంచి లేఖ విడుదల చేశారు. 

 ఈ నెల 26న నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద జాతీయ రహదారిపై ప్రమాదానికి గురయ్యారు మహేశ్‌. వెంటనే కత్తి మహేష్‌ను నెల్లూరులోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిచారు. పరిస్థితి కాస్త సీరియస్‌గా ఉండటంతో అక్కడ్నుంచి మెరుగైన చికిత్స కోసం చెన్నై అపోలోకి తరలించారు. అక్కడే వారం రోజులుగా కత్తి మహేష్‌కు చికిత్స జరుగుతుంది. కంటికి తీవ్రమైన గాయం కావడంతో మహేశ్‌ కంటిచూపు కోల్పోయారంటూ వార్తలు వెలువడ్డాయి. అవి అవాస్తమని, మహేశ్‌ చూపు కోల్పోయే అవకాశం లేదని వైద్యులు వివరించినట్లు తెలియజేశారు. సోమవారం  ఐసీయూ నుంచి వార్డుకు షిఫ్ట్ చేస్తారని పేర్కొన్నారు.  వార్డులో కనీసం రెండు వారాలు ఉండాల్సి ఉంటుందని వివరించారు. 

More Related Stories