మ‌హేశ్ సినిమాలో యాక్ష‌న్ హీరో పాత్ర ఇదేArjun
2021-07-04 00:30:10

యాక్షన్ హీరో అర్జున్ తమిళ సినిమాలతో వెండితెరకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత తెలుగులోనూ స్టార్ హీరోలకు సమానంగా అభిమానులను పెంచుకున్నాడు. మొదట్లో కేవలం హీరోగా మాత్రమే చేసినా తర్వాత ఇతర పాత్రల్లో కూడా కనిపించి మెప్పించాడు. ప్రస్తుతం తెలుగు కంటే తమిళంలోనే ఎక్కువ సినిమాలు చేస్తున్నాడు. అర్జున్ చేసిన‌ సినిమాలు ఎక్కువ శాతం తెలుగులో డబ్బింగ్ కావడంవల్ల అర్జున్ తెలుగు సినిమాలకు దూరమైనట్లు ఎవరికీ అనిపించడం లేదు. 

ఇప్పటికే నితిన్ హీరోగా నటించిన 'లై' సినిమాలో ఈ నటుడు విలన్ గా చేసి మెప్పించాడు. మరియు  విశాల్ హీరోగా నటించిన అభిమన్యుడు సినిమాలో కూడా ప్రతినాయకుడిగా నటించాడు. ఇదిలా ఉండా ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా నటిస్తున్న 'సర్కారు వారి పాట' సినిమాలో కూడా నటిస్తున్న సంగ‌తి తెలింసిందే. అయితే అది ఖ‌చ్చితంగా విలన్ పాత్ర అయి ఉంటుందని అంతా అభిప్రాయపడ్డారు. కానీ ఇప్పుడు అది విలన్ పాత్ర కాదని పవర్ ఫుల్ పోలీస్ అధికారి క్యారెక్టర్ అని ఫిల్మీ దునియా  లో గుసగుసలు వినబడుతున్నాయి. ఇందులో ఎంత‌వ‌ర‌కూ నిజం ఉందో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వ‌చ్చేవ‌ర‌కూ ఆగాల్సిందే. 

ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండ‌గా.... 'గీతా గోవిందంస‌  షేమ్ పరశురాం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు ఎస్.తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్స్ ప్లస్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాలు కొన్ని ఇప్పటికే విడుదల కాగా జనాలలో ఆసక్తిని పెంచుతున్నాయి. ఇక ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి కావాల్సి ఉండగా కరోనా వల్ల వాయిదా పడింది.

More Related Stories