అర్నాబ్ గోస్వామిపై 200కోట్ల పరువునష్టం దావాArnab Goswami
2020-10-16 08:44:47

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసు అనేక మలుపులు తిరిగిన సంగతి తెలిసిందే. సుశాంత్ ఆత్మహత్య పై అనుమానాలు ఉన్నాయని సుశాంత్ తండ్రి కేకే అతడి స్నేహితులు, రియాపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు సుశాంత్ స్నేహితులను విచారించారు. అయితే తనపై రిపబ్లికన్ టీవీ తప్పుడు ప్రచారం చేసిందంటూ సుశాంత్ స్నేహితుడు సందీప్ కుమార్ సింగ్ రూ.200 కోట్ల పరువు నష్టం దావా వేశారు. రిపబ్లికన్ టీవీ లో పదే పదే తప్పుడు కథనాలు ప్రచారం చేసారని అన్నారు. దాంతో తన పరువుకు నష్టం కలిగిందని పేర్కొన్నారు. అంతే కాకుండా రిపబ్లికన్ టీవీ అధినేత అర్నాబ్  గోస్వామి తనకు లికితపూర్వక సమాధానం చెప్పాలని లీగల్ నోటీసులో డిమాండ్ చేశారు. తన ప్రతిష్ఠతకు భంగం కలిగేలా రిపబ్లికన్ టీవీ కథనాలు ప్రసారం చేసిందని, సోషల్ మీడియాలో తనపై చేసిన ప్రసారాలను డిలీట్ చేయాలని కోరారు.

More Related Stories