తలైవి నుండి అరవింద స్వామి ఫస్ట్ లుక్ విడుదల Arvind Swami
2020-12-24 19:06:12

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఎంజిఆర్ గా అరవింద స్వామి నటిస్తున్నారు. తాజాగా సినిమాలో ఎంజీఆర్ పాత్రకు సంబందించిన ఫోటోలను చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇటీవలే ఈ సినిమాలోని కీలక షెడ్యూల్ హైదరాబాద్ లో పూర్తి చేసింది. సరిగ్గా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ సినిమాను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమాలో కరుణానిధి పాత్రలో ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు. ఇదిలా ప్రజనాయకుడు గా తమిళ ప్రజలు పిలుచుకునే ఎంజీఆర్ తమిళ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. ఆయన తరవాత ఎంజీఆర్ రాజకీయ వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన జయలలిత ఏకంగా ఆరు సార్లు ముఖ్యమంత్రి పదవిలో ఉంది. ఈ సినిమాపై తమిళనాట మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా అంచనాలు ఉన్నాయి. మరి ఆ అంచనాలను చిత్ర బృందం రీచ్ అవుతుందా లేదా.? చూడాలి.

More Related Stories