రామాయణ్‌కు మళ్లీ అదే అనూహ్య స్పందన.. Ramayana serial
2020-04-04 13:44:34

తెలుగు టెలివిజన్ చరిత్రలో ఎప్పటికీ మరిచిపోలేని అద్భుతమైన దృశ్యకావ్యం రామాయణ్. 1987 నుంచి 88 మధ్యలో దూరదర్శన్ లో ప్రసారమైన ఈ ధారావాహికను అప్పట్లో అంతా చూసి ఓన్ చేసుకున్నారు. ఈ సీరియల్ లో రాముడి పాత్ర పోషించిన అరుణ్ గోవిల్ ఇప్పుడు కనిపించినా కూడా రాముడు అంటూ కాళ్లు పట్టుకుంటారు. అంత ప్రభావం చూపించింది రామాయణ్ సీరియల్. రామానంద్ సాగర్ తెరకెక్కించిన ఈ అద్భుతమైన సీరియల్ ను ఇప్పుడు మరోసారి ప్రసారం చేస్తుంది దూరదర్శన్. లాక్ డౌన్ కారణంగా 21 రోజుల పాటు మరోసారి ఈ సీరియల్ రిప్లే చేస్తుంది. జనవరి 25, 1987 నుంచి జులై 21, 1988 వరకు అప్పట్లో రామాయణ్ వచ్చింది. అప్పుడు సంచలన వ్యూయర్ షిప్ అందుకుంది ఈ సీరియల్. 

అప్పట్లో ఎంటర్ టైన్మెంట్ ఛానెల్స్ లేవు కాబట్టి రామాయణ్ చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలోనే ఇప్పుడు మరోసారి డిడి నేషనల్ లో ప్లే అవుతున్న రామాయణ్.. మరోసారి అలాంటి సంచలనమే రేపుతుంది. మార్చ్ 28 నుంచి దీన్ని పున:ప్రసారం చేస్తున్నారు. తొలివారం ముగిసిన తర్వాత వచ్చిన రేటింగ్స్ చూసి అంతా షాక్ అయ్యారు. ఈ క్రమంలోనే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆసక్తికరమైన ట్వీట్ చేసింది. 2015లో బార్క్ మొదలైన తర్వాత దూరదర్శన్ కు అత్యధిక రేటింగ్ తీసుకొచ్చిన సీరియల్ రామాయణ్ అంటూ వాళ్లు ట్వీట్ చేసారు. దాన్నిబట్టి రామాయణ్ సీరియల్ కు ఉన్న క్రేజ్ ఏంటో తెలియచేస్తుంది. ఈ పున:ప్రసారంపై మోదీ లాంటి ప్రముఖులు కూడా ఇప్పటికే ప్రశంసల వర్షం కురిపించారు. 

More Related Stories