కోలీవుడ్లో విషాదం..కరోనాకు అసురన్ నటుడు బలి

కరోనా మహమ్మారి కోలీవుడ్ లో విషాదం నింపింది. ఇప్పటికే కరోనాతో ఎంతోమంది నటీనటులు మరణించగా తాజాగా అసురన్ సినిమాలో కీలకపాత్రలో నటించిన నితీష్ వీర 45 మృతి చెందారు. నితీష్ వీర అసురన్ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లో విలన్ గా నటించారు. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో నితీష్ నటనకు కూడా ప్రశంసలు వచ్చాయి. కాగా కొద్ది సేపటిక్రితమే నితీష్ కన్నుమూశారు. ఇదిలా ఉండగా పుదుపెట్టై సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఈ సినిమాకు సెల్వరాఘవన్ దర్శకత్వం వహించారు. దర్శకుడు సెల్వరాఘవన్ తో నితీష్ రానకు మంచి సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలోనే తన సినిమాతో నితీష్ రానను పరిచయం చేశారు. ఇక నితీష్ మరణంతో సెల్వ రాఘవన్ విషాదంలో మునిగారు. నా మణి ఆత్మకు శాంతి చేకూరాలని నితీష్ పాత్రను గుర్తుచేసుకుని ట్వీట్ చేశారు. అంతే కాకుండా అసురన్ నటి అభిరామి నితీష్ మరణానికి సంతాపం తెలుపుతూ..నితీష్ అన్న మరణంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాను. ఎంతో అద్భుతమైన నటుడు.ఇది ఎప్పుడూ ఊహించలేదు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. అంతే కాకుండా పలువురు సినీప్రముఖులు కూడా నితీష్ ఆత్మశాంతించాలంటూ సోషలో మీడియా ద్వారా సంతాపం ప్రకటిస్తున్నారు.