అశ్వథ్థామ లైవ్ అప్‌డేట్స్...ప్రీమియర్ షో టాక్...Aswaddama Twitter Review.jpg
2020-01-31 14:20:57

నాగ శౌర్య మోస్ట్ ప్రస్టేజియస్ సినిమా అశ్వథ్థామ విడుదలైంది. ఛలో లాంటి సినిమా తర్వాత ఇప్పటి వరకు మళ్లీ హిట్ కొట్టలేకపోయాడు నాగశౌర్య. దాంతో సొంత బ్యానర్ లోనే ఈ చిత్రాన్ని చేసాడు ఈ కుర్ర హీరో. పైగా ఇప్పటి వరకు క్లాస్ ఇమేజ్ ఉన్న శౌర్య.. అశ్వథ్థామ సినిమాతో మాస్ హీరోగా మారిపోయాడు. తనకు ఈ ఇమేజ్ చాలా అవసరం అంటున్నాడు ఈయన. అందుకే సొంతంగా కథ రాసుకుని మరీ వచ్చాడు. మరి ఈ చిత్రంతో ఈయన హిట్ కొట్టాడా.. ప్రీమియర్ షో పడిన తర్వాత టాక్ ఎలా ఉంది.. అసలు ప్రేక్షకులు శౌర్యను మాస్ హీరోగా ఒప్పుకున్నారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

ప్రస్తుతం వినిపిస్తున్న దాని ప్రకారం చూస్తుంటే అశ్వథ్థామకు టాక్ అయితే అంత పాజిటివ్ రాలేదు. ఈ చిత్రానికి యావరేజ్ టాక్ వచ్చింది. మొదలుపెట్టడమే చాలా నీరసంగా మొదలుపెట్టారని.. అయితే కాసేపటి తర్వాత సినిమా వేగం అందుకున్నా కూడా రొటీన్ కథ, కథనాలు సినిమాపై ఆసక్తి తగ్గించేసాయని చెప్తున్నారు ఓవర్సీస్ ఆడియన్స్. ఛలో తర్వాత హిట్ లేని శౌర్యకు ఇప్పుడు సోలోగా హిట్ అవసరం. ఇలాంటి సమయంలో అశ్వథామ కథను సొంతంగా తనే రాసుకుని వచ్చాడు నాగశౌర్య. ఇప్పటి వరకు ఈయన్ని కేవలం లవర్ బాయ్ పాత్రల్లోనే చూసారు ఆడియన్స్. కానీ ఈయన మాత్రం తొలిసారి పూర్తిగా మాస్ అవతారంలోకి మారిపోయాడు. కథ తానే రాసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించే బాధ్యత మాత్రం కొత్త దర్శకుడు రమణ తేజ చేతుల్లో పెట్టాడు శౌర్య. అమ్మాయిలను కిడ్నాప్ చేసి చంపేయడం.. వాళ్లను పట్టుకోడానికి హీరో చేసే ప్రయత్నమే సినిమా అంతా సాగుతుంది.

ఇదే లైన్ తోనే రాక్షసుడు సినిమా కూడా వచ్చింది. అయితే స్క్రీన్ ప్లేలో కొన్ని మార్పులు చేసారు దర్శక నిర్మాతలు. మొత్తానికి ఈ టాక్ తో శౌర్య ఏం మ్యాజిక్ చేస్తాడో చూడాలిక.

More Related Stories