అశ్వథ్థామ టీజర్‌ టాక్Aswathama Teaser
2019-12-27 14:19:31

అనుకున్న సమయానికే నాగశౌర్య ‘అశ్వథ్థామ’ టీజర్‌ వచ్చేసింది. రమణ తేజ అనే నూతన దర్శకుడు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నాగశౌర్యకు జంటగా మెహరీన్‌ నటిస్తున్నారు. శౌర్య సొంత ఐరా క్రియేషన్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు నాగశౌర్యనే కథ అందించడంతో ఈ సినిమా  మీద ఆసక్తి నెలకొంది. వచ్చే ఏడాది జనవరి 31న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రమోషన్స్ నేటి నుండి మొదలు పెట్టారు. ఓ బేబీ సమయంలో తనకు ఏర్పడిన పరిచయం వలన ఈ తీజర్ ని సమంత ‘అశ్వథ్థామ’ ట్విటర్‌ వేదికగా శుక్రవారం విడుదల చేసింది. ‘వావ్‌.. ఎంతగానో ఎదురుచూస్తున్న ‘అశ్వథ్థామ’ టీజర్‌ వచ్చేసింది. టీజర్‌ ఆకట్టుకునేలా ఉంది. ‘అశ్వథ్థామ’ బృందానికి ఆల్‌ ది బెస్ట్‌’ అని సమంత పేర్కొన్నారు. "ఎలా వుంటాడో కూడా తెలియని ఒక రాక్షసుడు .. వాడికి మాత్రమే తెలిసిన ఒక రహస్యం .. వాడి కింద పనిచేసే సైన్యం .. గమ్యం తెలియని ఒక యుద్ధం .. ఆ యుద్ధం గెలవాలంటే ఒక ఆరడుగుల నారాయణాస్త్రం కావాలి" అంటూ వాయిస్ ఓవర్ తో ఆ నారాయణాస్త్రం శౌర్యనే అని అర్ధం వచ్చేలా ఈ టీజర్ డిజైన్ చేశారు. థ్రిల్లర్‌ సినిమా అనే విషయం ఈ టీజర్‌ చూస్తే తెలుస్తోంది.  

More Related Stories