ఆది పురుష్ లో ప్రభాస్ తమ్ముడిగా కోలీవుడ్ హీరోAtharvaa murali
2020-12-08 16:14:10

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ డైరెక్షన్ లో "ఆదిపురుష్" అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటించబోతున్నట్టు తెలుస్తోంది. సినిమాను భారీ బడ్జెట్ తో ప్యాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కిస్తున్నారు. కాగా సినిమాకోసం ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఆది పురుష్ లో లంకేశ్ గా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ నటిస్తున్నట్టు ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇక కొద్ది రోజులుగా సినిమాలో ప్రభాస్ కు తమ్ముడిగా లక్ష్మణుడి పాత్రపై పలువురు నటుల పేర్లు వినిపిస్తున్నాయి. 

బాలీవుడ్ నటుడు ప్రభాస్ కు తమ్ముడిగా నటిస్తున్నాడని ఇన్ని రోజులు వార్తలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా కోలీవుడ్ హీరో అతర్వ ప్రభాస్ తమ్ముడిగా నటిస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. అతర్వ ఇటీవల వచ్చిన గద్దల కొండ గణేష్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. దానికంటే ముందు అతర్వ చాలా సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు ఆదిపురుష్ లో ఛాన్స్ కొట్టేసాడంటూ వార్తలు వస్తున్నాయి. ఇవి ఎంతవరకు నిజమో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

More Related Stories