అట్లీ టైం బాలేదా ..Shah Rukh Khan
2020-02-08 12:07:02

ఒకప్పుడు శంకర్ దగ్గర పని చేసిన అట్లీ రాజా రాణి, మెర్సల్, తేరి, తాజాగా బిగిల్  లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చి టాప్ డైరెక్టర్ లిస్ట్ లో ఒకడుగా నిలిచాడు. ఆ దెబ్బకి ఈయనకి ఏకంగా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ని డైరెక్ట్ చేసే అవకాశం దక్కిందని కూడా ప్రచారం జరిగింది. ప్రచారం అయితే గట్టిగా జరిగింది కానీ దాని మీద అధికారిక ప్రకటనలు లాంటివి అయితే ఏమీ రాలేదు. అట్లీ ఎన్టీఆర్ తో కూడా ఒక సినిమా ఒప్పుకున్నాడు. కానీ ఆ సినిమా ఇప్పట్లో పట్టాలు ఎక్కేలా కనపడడం లేదు. 

ఎందుకంటే ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూట్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలవుతుంది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో సినిమా చేయనున్నాడు. ఇక షారుఖ్ తో సినిమా గురించి ఒక ఆసక్తికర వార్త ఒకటి ప్రచారం జరుగుతోంది. అదేనంటే ఈ సినిమాని కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ లో నిర్మించనున్నట్లు తెలుస్తోంది. అట్లీ దర్శత్వంలో షారుఖ్ సినిమా ఉంటుందని ప్రచారం జరుగుతున్నా ఆయన్ని రాజ్ కుమార్ హిరానీ వచ్చి కలసి వెళ్లారని అంటున్నారు. 

షారుఖ్ కు రాజ్ కుమార్ హిరానీ కథ వినిపించినట్లు తెలుస్తోంది. అట్లీకి సౌత్ లో ఉన్న క్రేజ్ కి పోలిస్తే రాజ్ కుమార్ హిరానీకి బాలీవుడ్ లో ఉన్న క్రేజ్ మూడు రెట్లు అని చెప్పాలేమో. ఈ దెబ్బతో ఇప్పుడు షారుఖ్ ముందు అట్లీ దర్శత్వంలో నటిస్తాడా లేక రాజ్ కుమార్ హిరానీ సినిమాలో నటిస్తాడా అనేది తేలాల్సి ఉంది. 

More Related Stories