సాహో మ్యూజిక్ డైరెక్టర్ మీద దాడి !saaho
2019-08-01 08:49:56

ప్రస్తుతం టాలీవుడ్ అంతా సాహో ఫీవర్ లో ఉంది. ఇప్పటికే ఈ సినిమా వాయిదా పడడంతో కాస్త నిరాశ పడిన ప్రేక్షకులు ఆ సినిమా కోసం మరింతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈలోపు ఒక్కొక్కటిగా సాంగ్స్ రిలీజ్ చేస్తూ సినిమా మీద ఆసక్తిని పెంచుతున్నారు. అయితే తాజాగా ఈ సినిమాలోని సెకండ్ సింగిల్ ఏ చోట నువ్వున్నా అనే సాంగ్ కు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేసి ఆ తర్వాత సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఆ సాంగ్ ని కంపోజ్ చేసిన గురు రంథవ మీద ఎటాక్ జరిగినట్టు సమాచారం. నిజానికి సాహో సినిమాలోని ఒక్కో పాటకు ఒక్కో సంగీత దర్శకుడు పని చేశాడు. తొలి పాటకు తనిష్క్‌ బాగ్చి స్వరాలందించి ఆలపించగా తాజాగా విడుదలైన ఏ చోట నువ్వున్నా టీజర్‌లోని పాటకు గురు రంథవ సంగీతమందించి ఆలపించారు. ఈ మధ్య కాలంలో ఆయన అమెరికా, కెనాడాలో సంగీత ప్రదర్శనలు ఇచ్చారు. చివరగా వాన్‌ కోర్‌లో ప్రదర్శన ఇస్తున్న సమయంలో స్టేజ్‌ మీద షో చేస్తున్న సమయంలో ఓ పంజాబీ వ్యక్తి స్టేజ్‌ మీదకు వచ్చే ప్రయత్నం చేశాడని, అతన్ని స్టేజ్ మీదకి రానీయకపోవడంతో ప్రొగ్రామ్‌ అయిపోయి తిరిగి వెళ్లే సమయంలో గురు మీద దాడి చేశారని గురు టీమ్ ఆయన సోషల్‌ మీడియా అకౌంట్ ద్వారా ప్రేక్షకులకి చెప్పుకొచ్చాడు. ఈ దాడిలో గురు కంటికి తీవ్రగాయం కావటంతో నాలుగు కుట్లు పడ్డాయి. ఇండియా తిరిగి వచ్చిన గురు ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆ గురునానక్ నే తనను కాపాడాడని గురు పేర్కొన్నాడని ఆ పోస్ట్ లో పేర్కొన్నారు.
  

More Related Stories