సలార్ ఆడిషన్స్ లో ప్రభాస్ ఫ్యాన్స్ హంగామాPrabhas Salaar
2020-12-16 12:11:53

స‌లార్ కోసం టాలెంట్ ఉన్న కొత్త నటుల కోసం మేక‌ర్స్ ఆడిష‌న్స్ నిర్వ‌హిస్తున్నారు. హైద‌రాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో నిర్వ‌హించిన ఆడిష‌న్స్ కోసం పెద్ద సంఖ్య‌లో ఔత్సాహికులు త‌ర‌లివ‌చ్చారు. వేకువ జాము నుంచే ఆడిష‌న్స్ కోసం వంద‌ల సంఖ్య యువ‌కులు ఫ్యాక్ట‌రీ వ‌ద్ద‌కు చేరుకుని క్యూలో నిల‌బ‌డ్డారు. సంఖ్య పెరుగుతుండ‌టంతో వారికి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా మేక‌ర్స్ మల్టిపుల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు.  ఔత్సాహికులు క్యూ కట్టిన వీడియోస్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. స‌లార్ మేక‌ర్స్ హైద‌రాబాద్ తోపాటు బెంగ‌ళూరు, చెన్నై ప‌ట్ట‌ణాల్లో కూడా ఆడిష‌న్స్ నిర్వ‌హిస్తున్నారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం “కె జి ఎఫ్ చాప్టర్ 2” మూవీ ని తెరకెక్కిస్తున్నారు. మరోవైపు  రెబెల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో షెడ్యూల్ బిజీగా మారింది. ప్రస్తుతం రాధేశ్యామ్ షూటింగ్ జరుగుతోంది. అటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మరో మూవీ ఒప్పుకున్నాడు. ఇంకోవైపు బాలీవుడ్ డైరెక్టర్‌తో ఆదిపురుష్ సెట్స్ పైకెక్కనుంది. ఇక ఈ సినిమాలకు తోడు దేశవ్యాప్తంగా సంచలన హిట్ కొట్టిన కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో సినిమా సలార్ తెరకెక్కనుంది.

More Related Stories