అమ్మో చిన్నారి పెళ్లికూతురు ఎంత పెద్దదైపోయిందో..Avika Gor
2019-10-10 16:48:55

అతిచిన్న వ‌యసులోనే.. రావాల్సిన దానికంటే ఎక్కువ ఇమేజ్ నే సంపాదించుకుంది అవికాగోర్ అలియాస్ చిన్నారి పెళ్లికూతురు. ప‌దేళ్లు కూడా నిండకుండానే బాలికా వ‌ధు సీరియ‌ల్ తో ఇండియ‌న్ వైడ్ గా పాపుల‌ర్ అయింది ఈ భామ‌. ఇక ఇప్పుడు 18 ఏళ్ల‌కే హీరోయిన్ అయిపోయి తెలుగు ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఉయ్యాలా జంపాలా, సినిమా చూపిస్త మావా.. ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా లాంటి సినిమాల‌తో తెలుగులో మంచి ఇమేజ్ తెచ్చుకుంది అవికా. అయితే సినిమాల్లో న‌టిస్తున్నా.. ఇప్ప‌టి వ‌ర‌కు గ్లామ‌ర్ షోలో మాత్రం హ‌ద్దులు దాట‌లేదు అవికా గోర్. గ్లామ‌ర్ ఇండ‌స్ట్రీలో ఉంటూ అందాలు ఆర‌బోయ‌క‌పోతే నెగ్గుకు రావ‌డం కాస్త క‌ష్ట‌మ‌ని ఇప్పుడిప్పుడే చిన్నారి పెళ్లికూతురికి తెలిసొస్తున్న‌ట్లుంది. అందుకే తాను గ్లామ‌ర్ షోకు సిద్ధ‌మంటూ ద‌ర్శ‌క‌నిర్మాత‌లకు హింట్ ఇస్తుంది ఈ బ్యూటీ. రాజుగారిగది 3 సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఈ చిత్ర ప్రమోషన్స్ కు బయటికి వచ్చినపుడు హాట్ షోతో మతులు చెడగొడుతుంది అవికా గోర్. తాజాగా కొంచెం టచ్ లో ఉంటే చెప్తా షోలో కూడా తొడలు కనిపించేలా ఫ్రాక్ వేసుకుని వచ్చి రచ్చ చేసింది చిన్నారి పెళ్లికూతురు. మొత్తానికి ఇప్పట్నుంచి కథ డిమాండ్ చేస్తే ఎంతగా రెచ్చిపోడానికి అయినా సిద్ధమే అంటుంది ఈ భామ. మరి ఈ చిన్నారి పెళ్లికూతురు అందాలను మన దర్శక నిర్మాతలు ఎంతవరకు వాడేస్తారో చూడాలిక. 

More Related Stories