తన సినిమాకే నిర్మాతగా మారిన చిన్నారి పెళ్లి కూతురు



 Avika Gor
2021-02-16 18:34:26

'చిన్నారి పెళ్లికూతురు' సీరియల్‌తో బుల్లితెర వీక్షకులను దగ్గరైన అవికా గోర్ ఇప్పుడు నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. "ఉయ్యాలా జంపాలా, లక్ష్మీ రావే మా ఇంటికి, సినిమా చూపిస్త మావ, ఎక్కడికి పోతావు చిన్నవాడా" వంటి  సినిమాల్లో నటించిన అవికా గోర్ తెలుగు ప్రజలను ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు "అవికా స్క్రీన్ క్రియేషన్స్"  పేరుతో ఆమె ఒక నిర్మాణ సంస్థను ప్రారంభించింది. అంతే కాకుండా తన నిర్మాణంలోనే తాను హీరోయిన్ గా నటిస్తుంది. ఆచార్య క్రియేషన్స్‌, అవికా స్క్రీన్ క్రియేషన్స్ సంయుక్త నిర్మాణంలో ఆచార్య క్రియేషన్స్ ప్రొడక్షన్ నెం-3 రూపొందుతోంది. ఈ సినిమాలో అవికా గోర్ హీరోయిన్ కాగా సాయి రోనక్ హీరోగా నటిస్తున్నారు. 

ఈ చిత్రానికి ఎం.ఎస్. చలపతి రాజు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి మురళీ నాగ శ్రీనివాస్ గంధం దర్శకత్వం వహించనున్నారు. మెలోడ్రామా జానర్ లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు దర్శకుడు తెలిపారు. ఒకరిపై మరొకరికి విపరీతమైన ద్వేషం ఉన్న అమ్మాయి, అబ్బాయి... తప్పించుకోవడానికి వీలు లేని పరిస్థితిలో చిక్కుకుంటారు. ఆ తర్వాత ఏమైందనేది ఈ సినిమా కథ అని చెప్పారు. ఇక అవికా గోర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నా చిన్నతనం నుంచి ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉన్నాను. ఇక్కడ ప్రతి అంశాన్ని నిశితంగా గమనించా. అందుకని, ప్రొడక్షన్ లోకి రావాలని అనుకుంటున్నానని చెప్పారు. 

More Related Stories