బాబు బాగా బిజీ రివ్యూ రేటింగ్Babu-Baga-Busy-Review-Rating
2017-05-05 12:30:53

క్లీన్ ఇమేజ్ ఉన్న అవ‌స‌రాల శ్రీ‌నివాస్ హంట‌ర్ లాంటి సినిమాను రీమేక్ చేయాల‌నుకున్న‌పుడు అంతా ఏంటీ పిచ్చ ప‌ని అనుకున్నారు. మ‌రి అవ‌స‌రాల చేసిన ప‌ని రైటా.. రాంగా..? ఈ బాబు బాగా బిజీ ఎలా ఉంది..? ఈ సినిమా అవ‌స‌రాల‌ను హీరోగా నిల‌బెడుతుందా..?

క‌థ ‌: మాధ‌వ్(శ్రీ‌నివాస్ అవ‌స‌రాల‌) సెక్స్ అడిక్ట్. చిన్న‌పుడు ఊల్లో ఉన్న త‌న కజిన్స్ (ప్రియ‌ద‌ర్శి, ఇంకొక‌రు) వ‌ల్ల అప్ప‌ట్నుంచే అడ‌ల్ట్ కు అల‌వాటు ప‌డ‌తాడు మాధ‌వ్. ఆ త‌ర్వ‌త పెరుగుతున్న ఏజ్ తో పాటు అత‌డిలో కోరిక‌లు కూడా పెరుగుతుంటాయి. అలాంటి టైమ్ లో ఆయ‌న‌కు రాధ (మిస్తీ) ప‌రిచ‌యం అవుతుంది. ఆమెను సిన్సియ‌ర్ గా ప్రేమిస్తాడు. కానీ అత‌డికి గ‌తంలో చాలా మందితో ప‌రిచ‌యాలు ఉంటాయి. కాలేజ్ డేస్ లోనే సుప్రియ‌, తేజ‌స్వి.. మాధ‌వ్ జీవితంలోకి వ‌స్తారు. వాళ్ల‌కు ఇత‌డికి సంబంధం ఏంటి.. అస‌లు మాధ‌వ్ వ‌ల్ల వాళ్ల జీవితాలు ఎలా నాశ‌న‌మ‌య్యాయి.. రాధాతో అత‌డి ప‌రిచ‌యం పెళ్లి వ‌ర‌కు వ‌స్తుందా రాదా అనేది మిగిలిన క‌థ‌..!

క‌థ‌నం : సెక్స్ అనే ప‌దాన్ని ప‌దిమందిలో ప‌ల‌క‌డానికే మ‌నం ఇబ్బంది ప‌డ‌తాం. కానీ అలాంటి కాన్సెప్ట్ ను తీసుకుని చేసిన సినిమా బాబు బాగా బిజీ. బాలీవుడ్ లో విజ‌యం సాధించిన హంట‌ర్ సినిమాను ఇక్క‌డ రీమేక్ చేసారు న‌వీన్ మేడారం. క‌థ‌లో పెద్ద‌గా మార్పులేమీ చేయ‌లేదు. తొలి సీన్ నుంచే తాను చెప్పాల‌నుకున్న క‌థ‌లోకి వెళ్లిపోయాడు. ఒరిజిన‌ల్ కు న్యాయం చేయాల‌నుకున్నారేమో గానీ.. ఒక‌ట్రెండు బాగా డోస్ ఎక్కువైన సీన్స్ మిన‌హా హంట‌ర్ ను ఉన్న‌దున్న‌ట్లు దించేసారు. శ్రీ‌నివాస్ అవ‌స‌రాల కూడా క్లీన్ ఇమేజ్ ఈ సినిమాతో ప‌క్క‌న బెట్టేసాడు. ఫ‌స్టాఫ్ అంతా మ‌నోడి లీల‌ల‌తోనే స‌రిపోతుంది. అమ్మాయిల్ని ఇంప్రెస్ చేయ‌డానికి శ్రీ‌నివాస్ అవ‌స‌రాల చేసే సీన్స్ కామెడీగా అనిపించినా.. చూడ్డానికి చాలా ఎబ్బెట్టుగా ఉంటాయి. నాలుగు గోడ‌ల మ‌ధ్య మాట్లాడుకోవాల్సిన విష‌యాల్ని బ‌ట్ట‌బ‌య‌లు చేసి చూపించారు సినిమాలో. కాన్సెప్ట్ బోల్డ్ గా ఉంది.. మేం ధైర్యం చేస్తున్నామ‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు చంక‌లు గుద్దుకున్నా.. మ‌న ప్రేక్ష‌కులు ఆ రేంజ్ బోల్డ్ గా ఆలోచిస్తారా అనేది ప్ర‌శ్నార్థ‌క‌మే..! సినిమా అంతా ఒకే పనిపై బాబు బిజీగా క‌నిపిస్తాడు. ఆ బిజీని త‌ట్టుకోవ‌డం ఇక్క‌డి ప్రేక్ష‌కుల‌కు క‌ష్ట‌మే. బండ బూతులు మాట్లాడి.. చివ‌ర్లో ఇది బూతు నాన్నా మాట్లాడొద్దు. అని నీతులు చెప్పిన‌ట్లుంది ఈ బాబు బాగా బిజీ. బాలీవుడ్ క‌ల్చ‌ర్ కు ఇది ఎక్కిందేమో గానీ.. ఇక్క‌డ మాత్రం బాబు చేసే ప‌నుల్ని ప్రేక్ష‌కులు ప‌ట్టించుకోవ‌డం క‌ష్టం. సెకండాఫ్ కూడా పెద్ద‌గా ఆక‌ట్టుకునే అంశాలేమీ లేవు. సినిమా మొత్తం ఒక‌టే ధ్యాస‌లో ఉంటాడు హీరో. ఓ వైపు పెళ్లి చేసుకోబోయే అమ్మాయితో సిన్సియ‌ర్ గా ఉంటాన‌ని స్నేహితుడితో చెబుతాడు.. అప్పుడే మ్యావ్ అంటూ అదే ప‌నితో బిజీగా ఉంటాడు. అలాంటి కారెక్ట‌ర్ సినిమాలో హీరోది.

న‌టీన‌టులు : శ్రీ‌నివాస్ అవ‌స‌రాల‌, మిస్తీ చ‌క్ర‌వ‌ర్తి, సుప్రియ‌, ప్రియ‌ద‌ర్శి త‌దిత‌రులు.. క‌థ‌: హ‌ర్ష‌వ‌ర్ద‌న్ కుల‌క‌ర్ణి స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: న‌వీన్ మేడారం శ్రీ‌నివాస్ అవ‌స‌రాల న‌ట‌న గురించి కొత్త‌గా చెప్పాల్సిందేమీ లేదు. ఆయ‌న గురించి అంద‌రికీ తెలిసిందే. కామెడీ రోల్స్ లో ఇప్ప‌టికే త‌న‌ను తాను నిరూపించుకున్నాడు శ్రీ‌నివాస్ అవ‌స‌రాల. అలాంటి క్లీన్ ఇమేజ్ ఉన్న న‌టుడు ఇలాంటి సెక్స్ అడిక్ట్ కారెక్ట‌ర్ ఎందుకు ఒప్పుకున్నాడో ఆయ‌న‌కే తెలియాలి. ఏదైనా కొత్త ద‌నం కోసం ట్రై చేసాడుకున్నా.. ఇంత‌టి కొత్త‌ద‌నం మ‌న ప్రేక్ష‌కుల‌కు న‌చ్చుతుందా అని ఒక్క‌సారి ఆలోచించుకోవాల్సింది. హీరో స్నేహితుడిగా పెళ్లిచూపులు ఫేమ్ ప్రియ‌ద‌ర్శి బాగా న‌టించాడు. అత‌డి కామెడీ బాగుంది. హీరోయిన్లు మిస్తీ, తేజ‌స్వి, సుప్రియ కారెక్ట‌ర్లు అలా వ‌చ్చి ఇలా వెళ్లేవే కానీ సినిమా మొత్తం జ‌ర్నీ కావు. శ్రీ‌ముఖి ఒకే సీన్ లో క‌నిపించింది.

టెక్నిక‌ల్ టీం : బాబు బాగా బిజీ టెక్నిక‌ల్ టీంలో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు సునీల్ క‌శ్య‌ప్. ఈ సినిమాకు మంచి పాట‌లు అందించాడు సునీల్. ముఖ్యంగా క్లాసిక‌ల్ ట‌చ్ లో సాగే రెండు పాట‌లు బాగున్నాయి. ఇక డైలాగ్స్ కూడా ప‌ర్లేదు. కొత్త ద‌ర్శ‌కుడు న‌వీన్ మేడారం తొలి సినిమాకే ఇలాంటి స‌బ్జెక్ట్ తీసుకోవ‌డంతో సాహ‌సం చేసాడ‌నే చెప్పాలి. ఈయ‌న డైరెక్ష‌న్ ప‌ర్లేదు గానీ తీసుకున్న కాన్సెప్ట్ ద‌గ్గ‌రే అస‌లు స‌మ‌స్య వ‌చ్చింది. ఇంత బోల్డ్ కాన్సెప్ట్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు న‌చ్చ‌డం సాధ్య‌మ‌య్యే విష‌యం కాదు..

చివ‌ర‌గా : ఈ బాబు చేసే ప‌నులు త‌ట్టుకోవ‌డం క‌ష్టం.. బూతుల్ని బూతులుగా చూపించి.. చివ‌ర్లో ఇలా బూతు ప‌నులు చేయొద్దు.. అని నీతులు చెప్పిన‌ట్లుంది బాబు బాగా బిజీ..!

Rating 1/5

More Related Stories