బాబు చంపేస్తాడు .....రామ్ గోపాల్ వర్మ..Ramgopal-Varma-latest.jpg
2019-09-24 06:39:43

నెగటివ్ పబ్లిసిటీ చేయడంలో భారతదేశ సినీ చరిత్రలో రామ్ గోపాల్ వర్మని మించిన వారు మరొకరు లేరు. ఆయన తన సినిమాను మొహం మీదే చూడొద్దు అని చెబుతాడు. తన సినిమాను ఆదరించకండి అంటాడు. ఇప్పుడు కూడా మరో జిమ్మిక్కు చేస్తున్నాడు వర్మ. ప్రస్తుతం ఈయన కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఇందులోని తొలిపాట ఇప్పటికే సంచలనం సృష్టించింది. ఇప్పుడు మరో పాటను కూడా విడుదల చేయబోతున్నాడు ఈ దర్శకుడు. బాబు చంపేస్తాడు అంటూ మొదలయ్యే ఈ పాట సెప్టెంబర్ 24న విడుదల కానుంది. అది కూడా వీర బ్రహ్మ ముహూర్తం అయిన సాయంత్రం 4 గంటల 37 నిమిషాలకు విడుదల అవుతుందని చెప్పాడు వర్మ. దయచేసి ఈ పాటను విని ఆనందించకండి అంటూ తనదైన శైలిలో పోస్ట్ చేసాడు.

కచ్చితంగా ఈ సినిమాతో మరోసారి సంచలనాలు, కాంట్రవర్సీలు సృష్టించడానికి సిద్ధమవుతున్నాడు ఈ దర్శకుడు. ఇదే ఏడాది సినిమా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు లుక్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. దానికి తోడు కావాలని వివాదాలను కొని తెచ్చుకుంటున్నాడు వర్మ. మరోసారి ఇప్పుడు ఇదే చేస్తున్నాడు. మరి ఈసారి ఎలాంటి సరికొత్త వివాదానికి రామ్ గోపాల్ వర్మ తెర తీస్తాడనేది చూడాలి.

More Related Stories