Back Door Movie ReviewBack Door Movie Review
2021-12-27 02:27:02

అవును, అవును 2, సీమ‌ట‌పాకాయ్, జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా త‌దిత‌ర చిత్రాల్లో న‌టించిన క‌థానాయిక పూర్ణ న‌టించిన తాజా చిత్రం బ్యాక్ డోర్. ఇందులో తేజ త్రిపురాన క‌థానాయ‌కుడు. విభిన్న‌మైన క‌థాంశంతో రూపొందిన ఈ చిత్రానికి క‌ర్రి బాలాజీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ మూవీని బి. శ్రీనివాస‌రెడ్డి నిర్మించారు. ట్రైల‌ర్ యూత్ ని బాగా ఎట్రాక్ట్ చేయ‌డంతో సినిమా పై ఆడియ‌న్స్ లో క్యూరియాసిటీ ఏర్ప‌డింది. ఇక ఈ రోజు బ్యాక్ డోర్ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మ‌రి.. బ్యాక్ డోర్ ఆడియ‌న్స్ ని మెప్పించిందా..?  లేదా..? అనేది ఇప్పుడు చూద్దాం.

క‌థ - అంజ‌లి (పూర్ణ‌) భ‌ర్త బిజినెస్ మేన్. ఆయ‌న‌కు అస్స‌లు ఖాళీ ఉండ‌దు. ఇక పూర్ణ త‌న ఇద్ద‌రు పిల్ల‌ల‌ను చూసుకుంటూ ఆనందంగా జీవితం సాగిస్తుంటుంది. అయితే.. ఓ రోజు ఓ పెళ్లికి వెళుతుంది. అక్క‌డ అంజ‌లికి అరుణ్ (తేజ త్రిపురాన‌) ప‌రిచయం అవుతాడు. అత‌ని మాట‌ల‌కు అంజ‌లి, అంజ‌లి అందానికి అరుణ్.. ఇలా ఒక‌రికొక‌రు ఇష్ట‌ప‌డుతుంటారు. ఇక అక్క‌డ నుంచి ఇద్ద‌రూ ఫోన్ లో మాట్లాడుకోవ‌డాలు.. క‌లుసుకోవ‌డాలు చేస్తుంటారు. 

భ‌ర్త ఆఫీస్ కి, పిల్ల‌లు స్కూల్ కి వెళ్ల‌గానే.. అంజ‌లి అరుణ్ కి ఫోన్ చేసి ఇంటికి ర‌మ్మంటుంది. అంద‌మైన అంజ‌లి ఇంటికి ర‌మ్మంటే వెళ్ల‌కుండా ఉంటాడా.?  ఫోన్ రావ‌డ‌మే ఆల‌స్యం అరుణ్ క్ష‌ణాల్లో అంజ‌లి ఇంటిలో ఉంటాడు. అంజ‌లి త‌న మ‌న‌సులో మాట‌ల‌ను బ‌య‌ట‌పెడుతుంది. అలాగే అరుణ్ కూడా అంజ‌లి అంటే ఎంత ఇష్ట‌మో చెబుతాడు. ఇక బ‌ల‌హీన‌మైన ఆ క్ష‌ణాల్లో అంజ‌లికి మ‌న‌సు త‌ప్పు అని చెబుతుంటుంది. వ‌య‌సు అరుణ్ ని కోరుకుంటుంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో అంజ‌లి ఏం చేసింది..?  అరుణ్ ఏం చేయాల‌నుకున్నాడు.?  ఆత‌ర్వాత ఏం జ‌రిగింది..? అనేదే మిగిలిన క‌థ‌.

ప్లస్ పాయింట్స్
పూర్ణ నటన
క‌థ‌
ఎమోష‌న‌ల్ సీన్స్

మైన‌స్ పాయింట్స్
అక్క‌డ‌క్క‌డా స్లోగా ఉండ‌డం

విశ్లేష‌ణ - ఓ వైపు ఇల్లాలుగా, మ‌రో వైపు ప్రియురాలుగా పాత్ర స్వ‌భావానికి త‌గ్గ‌ట్టుగా అంజ‌లి పాత్ర‌లో పూర్ణ అద్భుతంగా న‌టించింది. స‌న్నివేశానికి త‌గ్గ‌ట్టుగా చ‌క్క‌ని హావ‌భాల‌తో ప‌ర్ ఫెక్ట్ అనేలా న‌టించింది. ఈ చిత్రానికి హైలైట్ అంటే పూర్ణ న‌ట‌నే. అందులో ఎలాంటి సందేహం లేదు. ఇక అరుణ్ పాత్ర‌లో తేజ త్రిపురాన బాగా న‌టించాడు. ఎక్క‌డా న‌టిస్తున్నాడు అనే ఫీలింగ్ క‌లిగించ‌లేదు అంటే ఎంత బాగా న‌టించాడో అర్థం చేసుకోవ‌చ్చు. మిగిలిన న‌టీన‌టులు పాత్ర‌కు త‌గ్గ‌ట్టుగా న‌టించారు.

పెళ్లైన త‌ర్వాత ఎలా ఉండాలి..? మ‌న‌సులో ఆలోచ‌న‌ల‌కు ఎలా అడ్డుక‌ట్ట వేయాలి..? అలా కాకుండా పెళ్లైన విష‌యం కూడా మ‌రచిపోయి త‌ప్పు చేయాలి అనిపిస్తే..?  దాని ఫ‌లితం ఎలా ఉంటుంది..? అనేది ద‌ర్శ‌కుడు క‌ర్రి బాలాజీ క‌ళ్ళ‌కుక‌ట్టిన‌ట్టుగా కాదు.. తెర‌కు క‌ట్టిన‌ట్టుగా చూపించారు. ఈ క‌థ‌ను కేవ‌లం యూత్ ని టార్గెట్ చేయ‌డం కోసం బోల్డ్ సీన్స్ ఎక్కువుగా పెట్టకుండా.. ఫ్యామిలీ ఆడియ‌న్స్ కూడా చూసేలా.. మెచ్చేలా తీయ‌డం అభినంద‌నీయం.

ప్రణవ్‌ సంగీతం, శ్రీకాంత్‌ నారోజ్‌ సినిమాటోగ్రఫీ బాగున్నాయి. అక్క‌డ‌క్క‌డా కాస్త స్లో అయిన‌ట్టు అనిపిస్తుంది. ఎడిట‌ర్ త‌న క‌త్తెర‌కు ఇంకాస్త ప‌ని చెప్పాల్సింది. ఇది త‌ప్పితే మైన‌స్ పాయింట్స్ అంటూ చెప్పుకోద‌గ్గ‌వి ఏమీ లేవు. బ్యాక్ డోర్ గురించి ఒక్క‌మాట‌లో చెప్పాలంటే.. అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కులు చూడ‌ద‌గ్గ మంచి సినిమా.

More Related Stories