రవితేజ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. డిస్కో రాజా మళ్లీ వాయిదా..ravi
2019-12-29 09:40:41

ఒకప్పుడు రవితేజ సినిమా అంటే అనుకున్న టైంకు మొదలై అనుకున్న టైంకి వచ్చేది. ఇంకా కొన్ని సార్లు చెప్పిన సమయం కంటే ముందే విడుదల చేసేవాడు మాస్ రాజా. ఆయన టైమింగ్  అంత పర్ఫెక్ట్ గా ఉంటుంది. కానీ ఇప్పుడు మాత్రం రవితేజకు బ్యాడ్ టైం నడుస్తుంది. గతేడాది ఈయన నటించిన నేల టికెట్, అమర్ అక్బర్ ఆంటోని, టచ్ చేసి చూడు సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. దాంతో ఇప్పుడు ఆశలన్నీ డిస్కోరాజా సినిమాపైనే ఉన్నాయి. అందుకే ఈ సినిమా విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోకూడదని ఫిక్స్ అయిపోయాడు రవితేజ. ఈ సినిమా కాస్త ఆలస్యం అయినా పర్లేదు కానీ పర్ఫెక్ట్ అవుట్ పుట్ తో ప్రేక్షకుల ముందుకు రావాలని చూస్తున్నాడు  ఈ సీనియర్ హీరో. అందుకే డిసెంబర్ 25న రావాల్సిన సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కాలేదని  జనవరి 24 కి వాయిదా వేశారు. అయితే ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ అయిన ఇప్పుడు కూడా మరోసారి సినిమా వాయిదా పడుతుందని ప్రచారం జరుగుతుంది.

ఇప్పటి వరకూ జరిగిన డీఐతో రవితేజ సంతృప్తి చెందడం లేదని.. అందుకే అది మళ్లీ చేయాల్సిన అవసరం వచ్చేలా కనిపిస్తుందని తెలుస్తోంది. దానికి కాస్త సమయం పట్టేలా కనిపించడంతో జనవరి 24 నుంచి ఫిబ్రవరి మొదటి వారానికి ఈ సినిమాను వాయిదా వేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ అనుకున్నదాని కంటే పని త్వరగా పూర్తయితే జనవరి 31న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఆలోచిస్తున్నాడు రవితేజ. విఐ ఆనంద్ ఈ చిత్రానికి దర్శకుడు. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో కొన్ని సీన్లు సరిగా రాలేదని రీ షూట్ చేశారని గతంలో వార్తలు వినిపించాయి. ఇక ఇప్పుడు డిఐ విషయంలో కూడా రవితేజ చాలా పట్టుదలతో ఉన్నాడు. ఏదేమైనా డిస్కో రాజా సినిమాతో హిట్ కొట్టి మళ్లీ ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు మాస్ రాజా.

 

More Related Stories