బట్టతలకు భారీ కలెక్షన్స్.. బాలీవుడ్ ట్రేడ్ షాక్.. Bala
2019-11-11 18:34:41

బాలీవుడ్ లో విభిన్నమైన కాన్సెప్టులు ఎంచుకుంటూ తనదైన పంథాలో సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్న హీరో ఆయుష్మాన్ ఖురానా. తొలి సినిమా విక్కీ డోనర్ నుంచే ఈయనది ఇదే స్టైల్. ఇక ఇప్పుడు కూడా బట్టతలతో పడే ఇబ్బందులను ఫన్నీగా చూపిస్తూ ఈయన చేసిన సినిమా బాలా. గతవారమే ఈ చిత్రం విడుదలై.. మంచి టాక్ సొంతం చేసుకుంది. బట్టతల అంటేనే సాధారణ సమస్య.. అందరికీ ఉండే కామన్ ప్రాబ్లమ్. దాంతో ఈ సినిమాకు అటు విమర్శకులు.. ఇటు సాధారణ ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. కలెక్షన్లు కూడా అలాగే వస్తున్నాయి. బాలాకు తొలిరోజే 10.15 కోట్లు వచ్చాయి.. ఇక రెండో రోజు మరో 5 కోట్లు అదనంగా తీసుకొచ్చింది. మూడోరోజు ఆదివారం కావడంతో కుమ్మేసింది బాలా. 18 కోట్లకు పైగా వసూలు చేసి ఔరా అనిపించింది. మూడు రోజుల్లోనే ఈ చిత్రం 44 కోట్లు వసూలు చేసి ఆయుష్మాన్ కెరీర్ లో డ్రీమ్ గాళ్ తర్వాత బెస్ట్ ఓపెనింగ్ సినిమాగా నిలిచిపోయింది. ప్రమోషన్స్ ఇంకా బాగా చేస్తే సినిమా రేంజ్ ఇంకా పెరుగుతుందని భావిస్తున్నాడు హీరో ఆయుష్మాన్. ఈ సినిమాలో భూమి పెడ్నేకర్.. యామి గౌతమ్ హీరోయిన్లుగా నటించారు. అమర్ కౌశిక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను దినేష్ విజాన్ నిర్మించారు. ఈ సినిమాను తెలుగులో కూడా రీమేక్ చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఈ కోవలో టాక్స్ కూడా మొదలయ్యాయి. మొత్తానికి బట్టతల వాళ్లను తక్కువంచనా మాత్రం వేయకూడదండోయ్.. 

More Related Stories