సైరా వేడుకకు బాలయ్య వచ్చాడోచ్.. చిరంజీవితో పార్టీ..  Balakrishna
2019-10-10 17:45:22

సైరా నరసింహా రెడ్డి సినిమా మత్తులోంచి చిరంజీవి బయటికి రావడం లేదు. రోజూ ఏదో ఓ పార్టీ చేసుకుంటూనే ఉన్నాడు ఈయన. ఇప్పుడు కూడా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులందరికీ కలిపి పార్టీ ఇచ్చాడు మెగాస్టార్. అందులో చిరంజీవితో పాటు చాలా మంది ప్రముఖులు వచ్చారు. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ ఈ వేడుకకు రావడంతో చాలా మందికి అనుమానాలు తొలగిపోయాయి. కొన్ని రోజులుగా సైరాపై ఎందుకు బాలయ్య స్పందించడం లేదంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇంకా బాలయ్య, చిరు మధ్య దూరం తగ్గలేదంటూ ప్రచారం కూడా జరుగుతున్న సమయంలో సైరా వేడుకకు బాలయ్య రావడం నిజంగానే అభినందించదగ్గ విషయం. దాంతో అటు మెగా, ఇటు నందమూరి అభిమానులు ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. ఓ స్టార్ హోటల్లో జరిగిన ఈ ఈవెంట్ కు మురళీ మోహన్, సుబ్బిరామిరెడ్డి సహా చాలా మంది ప్రముఖులు హాజరయ్యారు. 

More Related Stories