హైదరాబాద్ వరద బాధితులకు బాలయ్య భారీ సాయం Balakrishna
2020-10-19 09:29:28

హైదరాబాద్ లో వర్ష బీభత్సము కొనసాగుతుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జన జీవనం అస్తవ్యస్తం అయింది. భారీ వర్షాలతో హైదరాబాద్ రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ప్రజాప్రతినిధులు, రక్షనందళాలు పడవల్లోనే ప్రయాణిస్తూ ప్రజల బాగోగులు చూసుకుంటున్నారు. ఇక వరదల కారణంగా గుడిసెల్లో ఉండే కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఈ నేపథ్యంలో వరద బాధితులను ఆదుకోవడానికి నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ భారీ సహాయాన్ని ప్రకటించారు. హైదరాబాద్ వరద బాధితుల కోసం బాలయ్య 1కోటి 50 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం ప్రకటించారు.   అదే విధంగా పాతబస్తీలో నివాసం ఉంటున్న 1000 కుటుంబాలకు బసవతారకం రామ సేవా సమితి ఆధ్వర్యంలో బిర్యానీ ప్యాకెట్లను పంపించి వారి ఆకలి తీర్చారు. ఇక బాలయ్య ముందుకు వచ్చి సహాయాన్ని ప్రకటించడంతో మరిబికొందరు స్టార్ట్స్ కూడా తమ సహాయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా బాలకృష్ణ కరోనా లాక్ డౌన్ సమయంలోను ప్రభుత్వానికి విరాళం అందించారు.

More Related Stories