బాలయ్య కన్ను ఆ మల్టీస్టారర్ దర్శకుడిపై పడిందా..nbk
2020-05-03 14:52:35

బాలయ్య ప్రస్తుతం బోయపాటి సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే వారణాసి షెడ్యూల్ పూర్తి చేసుకుని వచ్చారు. ఇందులో అఘోరాగా కూడా కనిపించబోతున్నాడు బాలయ్య. ఇదిలా ఉంటే బోయపాటి తర్వాత కూడా వరస సినిమాలు లైన్ లో పెడుతున్నాడు ఈ సీనియర్ హీరో. ఇప్పటికే కొందరు చెప్పిన కథలు విన్న బాలయ్యకు ఎవరూ పెద్దగా కిక్ ఇవ్వలేకపోయారు. ఇలాంటి సమయంలో ఇప్పుడు బాబీ చెప్పిన కథ ఒకటి బాలయ్యకు బాగా నచ్చిందని తెలుస్తుంది. లాక్‌డౌన్ కారణంగా ఆయన తర్వాతి సినిమాల గురించి చర్చలతో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్‌తో మూడేళ్ళ కింద జై లవకుశ లాంటి సినిమా చేసిన బాబీతో బాలయ్య చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. మరోవైపు ఈయన చిరంజీవితో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు.

బాలయ్యకు కూడా ఈయన దగ్గర మంచి కథ ఒకటి ఉందని.. లైన్ విన్న తర్వాత బాలకృష్ణ ఇంటికి కూడా పిలిచాడని తెలుస్తుంది. ఈ సినిమాకు నిర్మాత ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్ అయినా కూడా లాక్ డౌన్ తర్వాత అన్ని వివరాలు బయటికి వస్తాయని చెబుతున్నారు. ఈ సినిమాను బాలకృష్ణ బంధువు ఒకరు నిర్మించబోతున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది. అయితే ఈ కథలో బాలకృష్ణ రెండు మూడు మార్పులు చెప్పగా దానికి బాబీ కూడా ఓకే చెప్పాడని తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమా మీద బాబీ అనౌన్స్ మెంట్ కూడా చేస్తాడని తెలుస్తుంది. బాలయ్య తర్వాతే చిరంజీవి సినిమా ఉండబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా పవర్, జై లవకుశ, వెంకీ మామ సినిమాలతో బాబీ కెరీర్ బాగానే వెళ్తుంది. మధ్యలో సర్దార్ మాత్రమే నిరాశ పరిచింది.

More Related Stories