బాలయ్య అభిమానుల్లో కొత్త అనుమానాలు  Balakrishna
2019-10-25 10:09:20

బాలయ్య తమిళ దర్శకుడు కె ఎస్ రవికుమార్ కాంబినేషన్‌లో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గత ఏడాది ఈ ఇద్దరి కాంబినేష్ లో జైసింహా సినిమా వచ్చింది. ఇప్పుడు అదే టీమ్ అంటే ప్రొడ్యూసర్ తో సహా మళ్లీ కలిసి పనిచేస్తోన్న చిత్రమిది. ఈ సినిమా బాలయ్య కెరీర్ లో105వ చిత్రం కాగా, సినిమా మీద మంచి అంచనాలున్నాయి. ఈ సినిమాలో బాలయ్య లుక్ మరిన్ని అంచనాలను పెంచేస్తోంది. ఈ మూవీలో బాలయ్య పోలీస్ ఆఫీసర్ నుంచి గ్యాంగ్ స్టర్‌గా మారతారని సమాచారం. 

అయితే, ఈ సినిమా టైటిల్ గురించి కొంత కాలంగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతూనే ఉంది. ‘రూలర్, డిపార్ట్మెంట్ లాంటి కొన్ని టైటిల్స్ గా ప్రచారం అయ్యాయి. అయితే సినిమా యూనిట్ నుండి మాత్రం అధికారిక ప్రకటన ఏదీ వెలువడ లేదు. కానీ ఈ సినిమా శాటిలైట్ హక్కులు కొనుక్కున్న జెమినీ సంస్థ మాత్రం ఈ సినిమా టైటిల్ ని ప్రకటించేసింది. దీంతో జెమినిపై బాలయ్య బాబు ఫ్యాన్స్ ఫైర్ అయ్యారనుకోండి అది వేరే విషయం. ఇప్పుడు ఆ ప్రకటించేసిన టైటిల్ ని తాము మళ్ళీ ప్రకటిస్తున్నట్టు ఈ సినిమా యూనిట్ తాజాగా ప్రకటించింది. 

సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ను ఈనెల 26న మధ్యాహ్నం 2.50 గంటలకు విడుదల చేయనున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ హ్యాపీ మూవీస్ ట్వీట్ చేసింది. అయితే ఈ ప్రకటన నందమూరి అభిమానుల్లో ఆనందాన్ని నింపాల్సింది పోయి అనుమానాలను నింపుతోంది. ఎందుకంటే తెలిసిపోయిన టైటిల్‌కు మళ్లీ అనౌన్స్‌మెంట్ ఎందుకు ? అంటే టైటిల్ మార్చారా ? లేక అదే టైటిలా అనే రకరకాల అనుమానాలు బాలయ్య అభిమానులని తొలిచేస్తున్నాయట. ఇక వారి అనుమానాలన్నిటికీ రేపు మధ్యాహ్నం సమాధానం దొరకనుంది.  

More Related Stories