తండ్రి ఎన్టీఆర్ పాత్ర అంటే భయపడుతున్న బాలకృష్ణ..ntr
2020-03-31 14:55:26

అదేంటి ఇప్పటికే తండ్రి పాత్రలో నటించాడు కదా.. ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు గతేడాది విడుదలయ్యాయి.. దారుణంగా నిరాశపరిచాయి కదా.. మళ్లీ ఇప్పుడు తండ్రి పాత్రకు బాలకృష్ణ భయపడడం ఏంటి అనుకుంటున్నారా. దీని వెనక ఒక కారణం ఉంది.. ఆసక్తికరమైన కథ ఉంది. ఎన్టీఆర్ పాత్ర పోషించాలంటూ మరోసారి బాలయ్య దగ్గరికి ఒక దర్శకుడు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు తెలుగులోనే కాదు దేశంలోని అన్ని ఇండస్ట్రీలలో బయోపిక్స్ హవా బాగా నడుస్తోంది. ఒకప్పుడు చరిత్ర సృష్టించిన లెజెండ్స్ జీవితాలను ఇప్పుడు తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు దర్శక నిర్మాతలు. దీనికి కొత్త‌గా క‌థ కూడా రాయాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. ఉన్న క‌థ‌ను కాస్త మార్చి చెబితే స‌రిపోతుంది. ఇప్పటికే తెలుగులో ఎన్టీఆర్, సావిత్రి బయోపిక్స్ వచ్చాయి. ఇందులో ఎన్టీఆర్ బయోపిక్ డిజాస్టర్ అయ్యింది. సావిత్రి బయోపిక్ బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు తమిళనాట కూడా ఒక భారీ బయోపిక్ సిద్ధ‌మ‌వుతుంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, సినీనటి దివంగత నేత జయలలిత బయోపిక్ అనౌన్స్ చేశారు దర్శక నిర్మాతలు. అమలాపాల్ మాజీ భర్త ఏఎల్ విజయ్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో కంగ‌న ర‌నౌత్ హీరోయిన్.

ఎన్టీఆర్ బయోపిక్ నిర్మించిన విష్ణు ఇందూరి తమిళనాట జయలలిత బయోపిక్ తలైవి సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చేసింది. జి.వి.ప్రకాష్ కుమార్ దీనికి సంగీతం అందిస్తుండగా నీర‌వ్ షా సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. 100 కోట్ల‌తో జయలలిత బయోపిక్ తెరకెక్కిస్తున్నాడు ఏ ఎల్ విజయ్. తెలుగుతో పాటు త‌మిళ‌, మ‌ల‌యాళ, హిందీ భాష‌ల్లో కూడా ఈ చిత్రం విడుద‌ల కానుంది. అన్ని ఇండ‌స్ట్రీల్లో వ‌ర్క‌వుట్ అవుతుంద‌ని భావిస్తున్నాడు విజ‌య్. అందుకే భారీ బ‌డ్జెట్ పెట్టిస్తున్నాడు. ఇప్పటికే జయలలిత కుటుంబ సభ్యుల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకున్నాడు దర్శకుడు. అయితే ఈ సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ పాత్ర కూడా ఉంది. జయలలిత జీవితంలో ఆయన కూడా కీలకపాత్ర పోషించాడు. ఇద్దరూ కలిసి నటించారు కూడా. దాంతో సీనియర్ ఎన్టీఆర్ పాత్ర బాలకృష్ణతో చేయించాలని దర్శకుడు విజయ్ ప్రయత్నిస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. అయితే తండ్రి పాత్రలో మరోసారి నటించడానికి బాలకృష్ణ నో చెప్పినట్లు తెలుస్తోంది. ఎంత అడిగినా కూడా ఆయన సమాధానం మాత్రం చేయను అని వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దాంతో దర్శకుడు విజయ్ మరో ఆప్షన్ చూసుకుంటున్నాడు.

More Related Stories