తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు చెక్ అందించిన బాలయ్య.. Balakrishna
2020-04-04 01:29:56

కరోనా వైరస్ తో బాధ పడుతున్న వాళ్లను ఆదుకోడానికి సెలబ్రిటీస్ ఎవరికి తోచిన విరాళాలు వాళ్లు ఇస్తున్నారు. ఇందులో భాగంగానే బాలయ్య కూడా తన వంతుగా తెలంగాణ ప్రభుత్వ ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చాడు. కాస్త ఆలస్యంగా అయినా కూడా బాలయ్య కూడా విరాళం అందించడంతో పండగ చేసుకుంటున్నారు అభిమానులు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈయన ప్రకటించిన విరాళానికి సంబంధించిన చెక్ ను తెలంగాణ మంత్రి కేటీఆర్ కు అందచేసాడు. బసవతారకం ఆస్పత్రికి వచ్చిన కేటీఆర్ కు అక్కడే చెక్ అందించాడు బాలయ్య. దాంతో పాటు ఈ బాధితులకు కావాల్సిన హాస్పిటల్ సహాయ సహకారాలు కూడా అందించాలంటూ అక్కడి సిబ్బందితో పాటు డాక్టర్లకు కూడా సూచించాడు బాలయ్య. ఇదంతా పక్కనే ఉండి గమనించిన కేటీఆర్.. బాలయ్యకు నమస్కారం పెట్టాడు. ఎప్పుడు ఏ కష్టమొచ్చినా ముందుండే బాలయ్య.. మరోసారి భారీ విరాళం అందించి బంగారు బాలయ్య అనిపించుకున్నాడంటూ సంబరపడుతున్నారు ఫ్యాన్స్. 

More Related Stories