బాలయ్య నువ్వు రాజువయ్యా.. మహ రాజువయ్యా.. Balakrishna
2020-01-07 00:22:47

బాలయ్య సినిమాల్లోనే కాదు బయట కూడా హీరోనే అంటారు తెలిసిన వాళ్లు. ఆయన మనస్తత్వం అలాంటిది మరి. ఎవరినీ అంత త్వరగా బాధ పెట్టే మనిషి కాదు.. ఆయన నైజం కూడా అది కాదు. కేవలం హీరోగానే కాకుండా ఎమ్మెల్యేగా కూడా సేవ చేస్తున్నాడు ఈయన. దాంతో పాటే బసవతారకం హాస్పిటల్ ఛైర్మెన్ గా కూడా ఎంతోమందికి మేలు చేస్తున్నాడు ఈయన. 

ఇప్పుడు మరోసారి కూడా తన మంచితనం చాటుకున్నాడు బాలయ్య. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో పెద్దాయన పాత్ర పోషించిన విజయ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ చిత్రం అంతా బాలయ్యతో పాటు నందమూరి కుటుంబానికి వ్యతిరేకంగానే ఉంటుంది. అలాంటి సినిమాలో హీరోగా నటించాడు విజయ కుమార్. 

ఇప్పుడు ఈయన భార్యకు కాన్సర్ సోకింది. అడ్వాన్స్డ్ స్టేజీలో ఉంది. దాంతో ఈయన భార్యను బసవతారకం హాస్పిటల్ కు తీసుకొచ్చాడు విజయ కుమార్. అక్కడే ఆమెకు చికిత్స అందిస్తున్నారు వైద్యులు. తనకు పడని సినిమాలో నటించిన నటుడి భార్యను కూడా తన హాస్పిటల్లో అందరితో పాటే సమానంగా ట్రీట్ చేస్తున్నాడు బాలయ్య. అది కేవలం నటన మాత్రమే అని మనసులో ఉంచుకుని తన బాధ్యత నిర్వర్తిస్తున్నాడు బాలయ్య. 
 

More Related Stories