మోహన్ బాబు, బాలయ్య సైలెంట్ ఎందుకు... Balakrishna Mohanbabu
2020-04-01 13:45:58

కరోనా వైరస్ తో విలవిల్లాడుతున్న సినీ కార్మికుల కోసం సినిమా పరిశ్రమకు చెందిన బడా హీరోలు సహా సంపూ లాంటి చిన్న హీరోలు కూడా సాయం చేస్తున్నారు. ఆఖరికి కమెడియన్స్ సహా కెమెరా మెన్లు సైతం ముందుకు వచ్చి తమ వంతు సాయం తాము చేస్తున్నారు. దాసరి తర్వాత ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా ప్రచారం జరుగుతుంది. అది జరుగుతున్నట్టే తాజాగా చిరు సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇవ్వడం, అలాగే కరోనాపై కరోనా విషయంలో సీసీసీ అని ఒకటి ఏర్పాటు చేసి మరీ ముందుకు వెళ్తున్నారు. చిరు పెద్దరికం తీసుకుని అందరిని కలుపుకుపోతున్నాడు. అయితే ఇలాంటి సమయంలో బాలయ్య కామ్ గా ఉంటున్నాడు. సినిమా స్టార్ గా ఎటువంటి విరాళం ప్రకటించని బాలయ్య ఎమ్మెల్యేగా విరాళం ప్రకటించారు. అందరూ చిరుని ఒక రేంజ్ లో ఎత్తుతుంటే బాలయ్య సైలంట్ గా ఉన్నాడు. మరోపక్క మంచు  బాబు మోహన్ బాబు కూడా ఎటువంటి విరాళం ప్రకటించలేదు. ఇప్పుడు ఆ విషయమే హైలైట్ అవుతోంది. ఎంతో సంపాదించారు కదా ఇప్పుడు జనాల కోసం ఖర్చు పెడితే ఏమి పోతుంది అంటూ జనాలు ట్రోల్ చేస్తున్నారు.

More Related Stories