కాస్త బరువు పెరగవా బాలయ్య.. మరీ ఇంత సన్నగానా..?nbk
2020-03-04 13:53:38

ఇప్పుడు బాలయ్యను చూసి అభిమానులు కూడా ఇదే అనుకుంటున్నారు. అసలేమైంది మా బాలయ్యకు అంటూ షాక్ అవుతున్నారు. ఒక్కసారి కమిటైతే పోకిరిలో మహేష్ బాబులా తన మాట తనే వినడు నందమూరి బాలకృష్ణ. సినిమా కోసం ఏం చేయడానికైనా సిద్ధంగానే ఉంటాడు. అప్పట్లో ఎన్టీఆర్ బయోపిక్ కోసం చాలా కష్టపడ్డాడు బాలయ్య. కానీ అది దారుణంగా నిరాశపరిచింది. ఆ తర్వాత కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో నటించిన రూలర్ సినిమా కూడా డిజాస్టర్ అయింది. ఈ సినిమా కోసం కొత్త లుక్ ట్రై చేసాడు బాలయ్య. అంతేకాదు రూలర్ కోసం దాదాపు 10 కేజీలు తగ్గిపోయాడు బాలకృష్ణ. ఇక ఇప్పుడు తన లక్కీ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో చేస్తున్నాడు. తాజాగా షూటింగ్ కూడా మొదలైపోయింది. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైంది. అయితే ఇక్కడే బాలయ్యను చూసి అభిమానులు షాక్ అయ్యారు. మరీ బరువు తగ్గిపోయి పీలగా ఉన్న బాలయ్యను చూసి ఫ్యాన్స్ డీలా పడిపోయారు. జయ జానకీ నాయకాను నిర్మించిన మిర్యాల రవీందర్ రెడ్డి దీనికి నిర్మాత. ఇదే ఏడాది సినిమా విడుదల కానుంది. ఈ సినిమా కోసం బాలయ్య ఏకంగా 25 కేజీల బరువు తగ్గాడు. కథ ప్రకారం బాలయ్య అందులో సన్నగా కనిపించాలి. అందుకే ఈ సాసహం చేస్తున్నాడు బాలకృష్ణ. దీనికోసం రోజు జిమ్ లో 5 గంటలు కష్టపడుతున్నాడు. దాంతోపాటు వైట్ రైస్ తీసుకోవడం మానేశాడని తెలుస్తుంది. డైట్ లో మార్పులు కూడా చేసాడు బాలయ్య. సింహా, లెజెండ్ లాంటి సినిమాల తర్వాత బాలయ్యతో బోయపాటి చేస్తున్న సినిమా ఇది. అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఇందులో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తాడని తెలుస్తుంది. ఒకటి యంగ్ రోల్.. అందుకే ఈ చేంజోవర్ కోసం ట్రై చేస్తున్నాడు బాలకృష్ణ. మొత్తానికి భారీ బడ్జెట్ తోనే ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడు బోయపాటి శ్రీను. వినయ విధేయ రామ ఫ్లాప్ తర్వాత ఈయన చేస్తున్న సినిమా ఇది.

 

More Related Stories