బాలయ్య నెక్ట్స్ మూవీ టైటిల్ రౌడీయిజం.?Balakrishna new movie title
2021-09-15 04:55:29

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. దసరాకి ఈ సినిమాని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా తర్వాత బాలయ్య గోపీచంద్ మలినేని ప్రాజెక్టును లైన్లో పెట్టేశారు. త్వరలోనే ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.

గోపీచంద్ మలినేని 'క్రాక్' తరహాలోనే ఈ సినిమాను భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందించనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక ఈ సినిమా కోసం తాజాగా 'రౌడీయిజం' అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించినట్టుగా చెప్పుకుంటున్నారు. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం త్రిష - ఇలియానాలతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. వచ్చేనెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుందని సమాచారం.

More Related Stories