బాలకృష్ణ ఆ రీమేక్ ను ఎందుకు వద్దనుకున్నాడు..nbk
2020-04-17 07:21:07

ఈ మధ్య తెలుగులో మలయాళం సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. స్టార్ హీరోలు కూడా వాటిపై ఆసక్తి చూపిస్తున్నారు. ఈ మధ్య కాలంలో తెలుగులో బాగా వినిపిస్తున్న పేరు అయ్యప్పయుమ్ కోషియుమ్. ఈ సినిమాను తెలుగులో హారిక హాసిని సహ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ రీమేక్ చేయబోతుంది. గత మూడేళ్లలో'ప్రేమమ్', 'జెర్సీ', 'భీష్మ' సినిమాలతో ప్రముఖ నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకుంది సితార ఎంటర్‌టైన్‌మెంట్స్. ఇప్పుడు ఈ సంస్థ మలయాళ బ్లాక్ బస్టర్ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని చూస్తున్నారు. మలయాళంలో బిజూ మీనన్ చేసిన పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ కోసం బాలకృష్ణను ఒప్పించడానికి అన్ని విధాలా ప్రయత్నం చేశారు. కానీ ఆయన మాత్రం అస్సలు చేయను అని చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఇదే సినిమాలో పృథ్వీరాజ్ చేసిన రిటైర్డ్ ఆర్మీ హవల్దార్ రోల్ కోసం రానా దగ్గుబాటిని నిర్మాతలు సంప్రదించగా ఆయన ఓకే అయినట్లు తెలుస్తోంది. అయితే బాలకృష్ణ ఈ పోలీస్ ఆఫీసర్ పాత్రను ఎందుకు వదులుకున్నాడు అన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది. బాలకృష్ణ కాదనుకున్న పాత్రను ఇప్పుడు రవితేజ తో చేయించాలని చూస్తున్నారు నిర్మాతలు. ఆయన కూడా కాదంటే మాత్రం వెంకటేష్, నాగార్జునలో ఎవరో ఒకరు ఈ పాత్ర చేస్తారని ప్రచారం జరుగుతోంది.

 

More Related Stories