బాలకృష్ణ సాయం చేయలేదు.. లక్ష్మీస్ ఎన్టీఆర్ విజయ్ కుమార్‌Balakrishna
2020-01-08 19:45:49

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ నటుడు విజయ్ కుమార్‌కు నందమూరి బాలకృష్ణ సాయం చేశారనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమ కుటుంబానికి వ్యతిరేకంగా సినిమా తీసినా సరే విజయ్ కుమార్‌‌కు నందమూరి బాలకృష్ణ సాయం చేసి మరోసారి తన దయాగుణం చాటుకున్నారని వైరల్ అవుతోంది. అయితే తాజాగా ఈ వార్తలపై విజయ్ కుమార్ స్పందించారు. 

తన భార్యకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన విషయం వాస్తవమేన్న విజయ్ కుమార్ బసవతారకం హాస్పిటల్ లో వైద్యం చేయిస్తున్న మాట కూడా నిజమేనని అన్నారు. అయితే బాలయ్య తనకు సాయం చేశారన్నది మాత్రం నిజం కాదని ఆయన అంటున్నారు. తన భార్యకు క్యాన్సర్ అని తెలిసి వైద్యం ఎలా చేయించాలి అని వాకబు చేసినప్పుడు ఏలూరులోని తన స్నేహితులు అక్కడి ఆశ్రమ్ హాస్పిటల్‌ లో చేర్పించామని అక్కడ చికిత్స చేయించిన తరవాత హైదరాబాద్‌లోని బసవతారకం హాస్పిటల్ ప్రసిద్ధి కాబట్టి కీమో థెరపీ చేయించడానికి ఇక్కడికి తీసుకొచ్చానని చెప్పారు. 

ప్రస్తుతం కీమో థెరపీ జరుగుతోందని తెలిపారు. అయితే ఈ విషయం గురించి ఇప్పటి వరకు తనకు, తన స్నేహితులకు తప్ప ఎవ్వరికీ తెలీదని కానీ బాలయ్య సాయం చేశారనే వార్తలు ఎందుకు పుట్టుకొచ్చాయో అర్థం కాలేదని విజయ్ కుమార్ అన్నారు. తాను చిన్న వయసులో ఎన్టీఆర్‌ను కలిశాను కానీ బాలకృష్ణను ఒక్కసారి కూడా కలవలేదని చెప్పారు. 

ఎన్టీఆర్ కుమారుడిగా బాలకృష్ణ అంటే తనకు చాలా అభిమానమని.. ఒకవేళ తాను సహాయం అడిగివుంటే ఆయన చేసేవారే నని ఆయన పేర్కొన్నారు. అయితే ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు సంబంధించి మీకు పారితోష‌కం అంద‌లేద‌ట‌గా అని అడిగితే.. దాని గురించి మాట్లాడడం సబబు కాదని ఆయ‌న స‌మాధానం దాట‌వేశాడు. మీరు భయపడి సమాధానం దాట వేస్తున్నారా ? లేక ఇంకేదైనా రీజన్ ఉందా ? అని అడిగితే అదేమీ లేదని చెప్పుకొచ్చారు ఆయన, 

More Related Stories